fbpx

ఆశాల సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె

Share the content

ఆశా కార్యకర్తల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 14,15 తేదీలలో కాకినాడ కలెక్టరేట్ వద్ద జరగనున్న 36గంటల నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ళ పద్మ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమ గోడ పత్రికను వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసిన ఆశ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవులు ఆశా వర్కర్లకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ వర్క్ పేరుతో వేధింపులు ఆపాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని ఆశ వర్కర్లకు అమలు చేయాలని కోరారు. విధి నిర్వహణలో చనిపోయిన ఆశవర్కర్ల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఆశా వర్కర్ల న్యాయమైన పోరాటానికి కాకినాడ జిల్లా ప్రజలు సహకరించి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వ శేషబాబ్జి, చెక్కల రాజ్ కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు భారతి, మలకా నాగలక్ష్మి, చెక్కల వేణి, పచ్చిపాల గమ్య, దండుప్రోలు జ్యోతి, తలుపులమ్మ దేవి, భవాని, కుమారి, ఉమా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *