fbpx

జగన్ ప్రసంగాలు మార్చడానికి ప్రత్యేక బృందాలు

Share the content

వచ్చి ఎన్నికల్లో జగన్ ప్రసంగాలు జనాల్లోకి ఇలాగే వెళ్తే పరిస్థితి ఏమిటి అని ఇప్పుడు వైసిపి నేతల్లోనే ఆందోళన వ్యక్తం అవుతుంది. బహిరంగ సభల్లో చెప్పిందే పదే పదే చెబుతూ జగన్ పాడుతున్న పాట ప్రజల్లో సైతం అసహనం వ్యక్తం అయ్యేలా చేస్తుంది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరి బహిరంగ సభలు నిర్వహిస్తున్నప్పటికీ జగన్ ప్రసంగాల్లో పసలేకపోవడంతో పాటు చెప్పిందే చెబుతుండడం పట్ల ఇటు వైసిపి నేతలు అధికారుల్లోనే కాదు ప్రజల్లో సైతం చిరాకు కలిగిస్తోంది. కచ్చితంగా జగన్ ప్రసంగాలు తీరు మారాలని… ఇలాగే ఎన్నికల సభల్లో కూడా ప్రసంగిస్తే ఖచ్చితంగా జనం నుంచి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా జనసేన తెలుగుదేశం కూటమిలో చంద్రబాబు ప్రసంగాలు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ… జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగాలు మాత్రం యువతను ఉత్తేజంలో ముంచుతాయి. ప్రతి సభలో భిన్నంగా మాట్లాడుతూ లెక్కలతో సహా జగన్ ప్రభుత్వ బండారాలను బయటపెడుతున్న పవన్ కళ్యాణ్ ను దీటుగా ఎదుర్కోవాలంటే జగన్ చేస్తున్న ప్రసంగాల్లో మెరుపులు చమకులు ఎదురుదాడి తప్పనిసరిగా ఉండాలని భావిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ కు ఎన్నికల ప్రసంగాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆయన ప్రసంగాల రూపు మార్చేందుకు ఓ ప్రత్యేక బృందం ఆయనకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది.

** 2019 ఎన్నికల్లో జగన్ ప్రసంగాలు అప్పటి ప్రభుత్వ తీరును ఎండగడుతూనే స్థానిక పరిస్థితులను అలాగే స్థానిక రాజకీయాలను టచ్ చేస్తూ ముందుకు సాగేవి. అలాగే జగన్ పక్కనే స్థానికంగా పోటీ చేసే అభ్యర్థులను పక్కన పెట్టుకొని.. తమ ప్రభుత్వం రాగానే ఆయా ప్రాంతాలకు ఇచ్చే హామీలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రసంగం ఉండేది. దీనికోసం కూడా అప్పట్లో ప్రత్యేకంగా ఒక టీమ్ పనిచేసేది. స్థానిక రాజకీయ పరిస్థితులు అప్పటి ప్రభుత్వం తీరుతన్నులు అలాగే నియోజకవర్గ పరిస్థితులు ఇతరత్రా అంశాల మీద ముందుగానే జగన్కు ప్రత్యేకంగా ఒక నోట్ తయారు చేసి ఇచ్చేది. దీనిని అత్యంత అద్భుతంగా జగన్ చెప్పకపోయినాప్పటికీ అప్పటి పరిస్థితులు సూటిగా సుత్తి లేకుండా జగన్ ప్రకటించే వరాల దృష్ట్యా జనాల్లో మంచి రెస్పాన్స్ వచ్చేది. అయితే ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బహిరంగ సభలో మాట్లాడుతున్న తీరు చాలా పేలవంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని సైతం పేపర్లో చూసి చదవడమే కాక తెలుగులో సైతం అనేక రకాలుగా తప్పులు పలుకుతూ జగన్ మాట్లాడుతున్నారు. ఇది సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు చక్కగా ఉపయోగపడుతుంది. మరోపక్క జగన్ చేస్తున్న ప్రసంగాలు కూడా చాలా చప్పగా ఉంటున్నాయి. ప్రతి సభలోనూ అదే తీరులో మాట్లాడుతూ అదే విమర్శలు చేస్తూ ఏమాత్రం వైసిపి కార్యకర్తలను కూడా ఆయన ఆకట్టుకోలేకపోతున్నారు. ఒకవేళ ఏదైనా విమర్శ చేసిన అది భూమా రంగ్ మాదిరి మళ్లీ జగన్ కే తలకు చుట్టుకుంటుంది తప్ప రాజకీయ శత్రువులను ఏమాత్రం ఇబ్బంది పెట్టడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల సభలకు జగన్ అత్యంత బలమైన వ్యక్తిగా తయారు చేసేందుకు ఒక ప్రత్యేక టీం సిద్ధమైనట్లు తెలుస్తోంది. జగన్కు ప్రతిరోజు గంట నుంచి రెండు గంటల మేర ఎన్నికల సభలో ఎలా మాట్లాడాలి అన్న అంశంపై తర్ఫీదు ఇచ్చేందుకు ఒక ప్రత్యేక బృందం ఇప్పటికే సిద్ధమైంది. మాట్లాడే తీరుతో పాటు ప్రసంగాలలో ప్రజలను ఆకట్టుకునే అంశాలు ఎలా ఉండాలి అలాగే రాజకీయ విమర్శలు, రాజకీయ ఆరోపణలు ఎలా ఉండాలి అనే అంశాలపై జగన్కు ఈ బృందం ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుంది. జనవరి నుంచి రంగంలోకి దిగబోయే ఈ ప్రత్యేక బృందం ఇప్పటికే తన అజెండాను… విదేశాల నుంచి వ్యక్తిగత వికాస నిపుణులను తీసుకు వచ్చినట్లు సమాచారం. వీరు జనవరి నుంచి ప్రత్యేకంగా ప్రతిరోజు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా క్లాసులు చెప్పనున్నారు. దీంతో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బహిరంగ సభలోను ఎన్నికల సభలోను జగన్ శైలి మారాలని, మార్చాలని వైసీపీ నాయకత్వం మొత్తం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *