fbpx

ఏంటి “బ్రో ” ఈ రచ్చ

Share the content

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాజకీయ దాడి చేసేందుకు వైసిపి నేతల్లో కొంతమంది మంత్రులు ముందు వరుసలో ఉంటారు. పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా వ్యతిరేకిస్తూ మీడియా ముఖంగా కౌంటర్లు ఇచ్చే వరుసలో ముందుండేది మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేస్తున్న ప్రతిసారి జనసైనికులు అంబటి రాంబాబు పై తారాస్థాయిలో విరుచుకుపడుతుంటారు. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో పృధ్విరాజ్ నటించిన శ్యాం బాబు క్యారెక్టర్ అంబటి రాంబాబును ఉద్దేశించే ఉందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. దీనిపై మంత్రి అంబటి రాంబాబు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.

అంతలా ఏముంది సినిమాలో…?

బ్రో సినిమాలో ఒక పాటలో పృథ్వీరాజ్ వేసిన స్టెప్పును అలా కాదని పవన్ కళ్యాణ్ కొన్ని గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఆ శ్యాం బాబు క్యారెక్టర్ ను అంబటి రాంబాబు క్యారెక్టర్ గా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మీడియా ముఖంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. నేను కూడా పవన్ కళ్యాణ్ పై కొన్ని సినిమాలు తీస్తున్నానని వాటికి సినిమా పేర్లు కూడా రెడీ చేసి పెట్టానని మీడియా ముందు పోస్టర్లను చూపించారు. పవన్ కళ్యాణ్ సినిమాలతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తో ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ బ్రో సినిమా తీశారని మంత్రి రాంబాబు ఆరోపణలు చేశారు. అయితే మీడియా ముందుకు వచ్చి ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ ఇదంతా అవాస్తమని తమ వద్ద సినిమాకు చేసిన ఇన్వెస్ట్మెంట్ వచ్చిన కనెక్షన్స్ ప్రతిదీ పర్ఫెక్ట్ లెక్కలతో ఉందని అది బయటకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అసలు సినిమాలో శ్యాం బాబు క్యారెక్టర్ కేవలం ఒక పాటలో చిన్న సన్నివేశం మాత్రమే ఉందని దానికి మంత్రి అంబటి రాంబాబు స్పందించాల్సిన అవసరం ఏంటి అని కొంతమంది విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో శ్యాం బాబు క్యారెక్టర్ తనను ఉద్దేశించే పెట్టారని రాష్ట్ర మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒప్పుకోవడాని కొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జలవనుల శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టుపై ఏనాడూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదని కేవలం పవన్ కళ్యాణ్ పై విమర్శించడానికే ప్రెస్ మీట్ లు పెడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు . మరోపక్క జనసైనికులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం బ్రో సినిమాకు మంత్రి అంబటి రాంబాబు సైతం ప్రమోషన్ చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *