fbpx

రైతులను నట్టేట ముంచిన జగన్ సర్కార్

Share the content

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 18 మహాసభలు జనవరి 8, 9, 10 తేదీలలో రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు మహాసభ కు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తూర్పుగోదావరి జిల్లా మహాసభ.. జిల్లా అధ్యక్షులు పంతం నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు కేవివి ప్రసాద్, డేగ ప్రభాకర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 23న రైతు దినోత్సవం సందర్భంగా పాలకులు పెద్దపెద్ద ఫోటోలు దిగారని కానీ రైతు సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర అలసత్వం చూపిస్తున్నారని తెలిపారు. ప్రతి 30 గంటలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని ఈ పాలకులు కల్పిస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారులకు వచ్చిన తర్వాత ఆ హామీని మరిచిపోయారని విమర్శించారు. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. రాష్ట్రంలో జగనమోహన్ రెడ్డి రైతులను నట్టేట ముంచారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఎలా ఉద్యమించారో అదే స్ఫూర్తితో రైతు వ్యతిరేక విధానాలు చేపడుతున్న మోడీ,జగన్మోహన్ రెడ్డి లును గద్దె దింపే వరకు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు సంఘం రాష్ట్ర మహాసభలకు రైతు సంఘం జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య మాజీ మంత్రి రైతు నాయకుడు వడ్డే శోభనాద్రిశ్వరరావు, రైతు సైంటిస్టులు సోదర రైతు సంఘాల నాయకులు హాజరవుతారని ఆయన తెలిపారు.

  • రైతాంగం నడ్డి విరిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు
    అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తానన్న మోడీ ,నేడు తెచ్చిన వినాశకర వ్వవసాయ చట్టాలు వారి జీవితాలను మరింత దిగజార్చే విధంగా ఉన్నాయని విమర్శించారు. అసలే గిట్టుబాటు ధర లేక ప్రకృతి వైపరీత్యాలతో సతమతమవుతున్న రైతాంగానికి కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు గొడ్డలిపెట్టు లాంటివి అని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని అంబానీ,ఆదాని లాంటి కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. గత 6 నెలలుగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం ఉద్యమిస్తున్నా మోడీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు .కావున ఈ నల్ల చట్టాల జీవో కాపీల దహనం సందర్భంగా మోడీ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని రైతాంగాన్ని కోరారు .
  • రైతులను ఆదుకుంటాం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఏళ్లతరబడి అమలవుతున్న ఉచిత విద్యుత్ విధానాన్ని తుంగలో తొక్కి నగదు బదిలీ విధానం పేరుతో జీవో నెంబర్ 22 ను తీసుకురావడం సరైంది కాదని అన్నారు .ఇప్పటికైనా వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని దారుణంగా తెగనమ్ముతున్నారని కార్మిక వర్గం రోడ్ల పాలు చేస్తున్నదని వారు తెలిపారు. కరోనా సమయంలో వ్యవసాయ కార్మికులకు పనులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు 7500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు కొండ్రపు రాంబాబు సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే జ్యోతి రాజు సిపిఐ నగర సహాయ కార్యదర్శి సప్ప రమణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ముల్లపూడి పుల్లారావు శ్రీనివాస్ నాగేశ్వరరావు జిల్లా వ్యాప్తంగా రైతుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *