fbpx

చెవుల నుంచి రక్తం.. జగన్ ప్రసంగం

Share the content

ఎన్నికలు అయ్యేవరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ సభలోను మాట్లాడకపోతేనే మంచిది అన్నట్లు తయారైంది వ్యవహారం. ఒకే ఒక దంపుడు ఉపన్యాసం, అదే సుత్తి మాటలు, ఏ సభలో చూసిన ఒకే రకమైన హావుభావాలతో జగన్ సొంత పార్టీ కేడర్ కే చిరాకు తెప్పిస్తున్నారు. విపక్షాలపై పదునైన విమర్శలు చేయాల్సింది పోయి వారికి దొరికిపోతూ చేస్తున్న విమర్శలు నవ్వుల పాలు అయ్యేలా చేస్తున్నాయి. జగన్ మాట్లాడిన ప్రతి తర్వాత విపక్షాలు ఆయన వ్యాఖ్యల పట్ల రకరకాల ట్రోలింగ్ లకు పాల్పడుతున్నాయి. అసలే ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా చాలా వేగంగా ఉన్న సమయంలో జగన్ పదేపదే ట్రోలింగ్లకు గురికావడం దానిని సర్ది చెప్పలేక వైసీపీ సోషల్ మీడియా విభాగం పడరాని పాట్లు పడుతోంది. 2019 ఎన్నికల ముందు ఎంతో ఆవేశంగా ప్రసంగించి వైసిపి కార్యకర్తలతో శభాష్ అనిపించుకున్న జగన్ ఇప్పుడు దానికి పూర్తిగా భిన్నంగా ప్రసంగించడం వైసిపి కార్యకర్తలను నివ్వెరపరుస్తోంది. ప్రతి సభలోను ఒకే రకమైన వ్యవహార శైలి ఒకే రకమైన డైలాగులతో జగన్ విసుగు తెప్పిస్తుంటే, దానిని కవర్ చేసుకోలేక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చాలా కష్టపడాల్సి వస్తోంది. నిన్న మొన్నటి వరకు జగన్ మాట్లాడితే సంబరపడిపోయే ధోరణి క్రమంగా తగ్గుతోంది. జగన్ ఏం మాట్లాడుతారు అనేది ముందుగానే తెలిసిపోయినట్లుగా తయారైంది. ప్రతి చిన్న అంశానికి స్క్రిప్ట్ చూస్తూ చదవడం పట్ల ఎప్పటికీ విపక్షాలు ఆయనను పూర్తిగా ఏకిపారేస్తున్నాయి. అయినా జగన్ వ్యవహార శైలిలో స్క్రిప్ట్ చూసి చదవడంలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. ప్రతి చిన్న విషయానికి స్క్రిప్ట్ చూసి చదువుతూ ఆయన చేస్తున్న ప్రసంగం చాలా బోర్ కొట్టిస్తుంది అని వైసిపి డై హార్డ్ ఫ్యాన్స్ కూడా చెబుతున్నారు. లబ్ధిదారులను ఎలాగోలా సభలకు తరలించి మధ్యలోనే వెళ్లిపోతున్న ఆపుతున్నప్పటికీ వారు మాత్రం జగన్ చెబుతున్న ప్రసంగాన్ని ఏమాత్రం వినడం లేదు.

సామాన్య ప్రజలకు విసుగు

జగన్ వ్యవహార శైలి 2019 ఎన్నికల ముందు ఇప్పటికీ చాలా తేడా ఉందని సామాన్య ప్రజలు చెబుతున్న మాట. ఆయన వ్యవహార శైలే కాదు ఆయన ప్రసంగాలు కూడా చాలా దారుణంగా ఉన్నాయని 2019 ఎన్నికల ముందు చాలా కసిగా మాట్లాడిన జగన్, ప్రస్తుతం చాలా పేలవంగా మాట్లాడుతున్నారని కనీసం వినాలి అని కూడా అనిపించడం లేదు అని సామాన్య ప్రజలు చెబుతున్న మాట. స్క్రిప్ట్ చూసి చదువుతో కూడా చాలా తప్పులను చెబుతున్నారని, తెలుగు కూడా సరిగా పలకడం రావడం లేదు అన్నది మరో అభియోగం. ప్రతిపక్షాలను ఎప్పుడూ ఒకే రకమైన విమర్శలు చేస్తూ జగన్ చులకన అవుతున్నారు అని కనీసం వైసిపి మీడియా విభాగం అయినా చూసుకోవాలి. ఆయనకు రాసే స్క్రిప్టులు కాస్త కొత్తగా భిన్నంగా ఉండేలా జాగ్రత్త పడకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్ పూర్తిగా డామేజ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ప్రసంగాలే ఆయనను ముంచేస్తాయి అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *