fbpx

బీసీ ఎజెండాతో బోడే పార్టీ!

Share the content

2019 ఎన్నికల్లో కేవలం నియోజకవర్గం నేతగా ఉండిపోయిన మాజీ జనసేన పార్టీ నేత బోడె రామచంద్ర యాదవ్ ఇప్పుడు రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించడం వెనుక ఆ పార్టీ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే దాని వెనుక కీలకమైన చర్చ సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు వచ్చే సమయంలో కొత్త పార్టీలు రాక ఎప్పుడూ ఉంటుంది. కొత్త కొత్త వ్యక్తులు కొత్త సమీకరణాలు తెరపైకి వస్తుంటాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పుడు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో వస్తున్న పార్టీ కూడా కొత్త సమీకరణాలతోనే తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ జగన్ కు మరోపక్క తెలుగుదేశం పార్టీ రెండింటికి నష్టం చేకూర్చాలని ప్రధానమైన కాన్సెప్ట్ తో ఈ పార్టీ వస్తున్నట్లు అర్థమవుతుంది. రామచంద్ర యాదవ్ పార్టీ పూర్తిస్థాయిలో బీసీలకు అనుకూలంగా పనిచేసే అజెండాను ప్రకటించే అవకాశం ఉంది. దీని వెనుక కూడా బిజెపి పెద్దలు ఉన్నారని వార్తలు జోరుగా వస్తున్నాయి. అయితే పార్టీ మొదలైనప్పటి నుంచి దాని ప్రస్థానం, ముందుకు వెళ్లే రూట్ ఆధారంగా పార్టీ వెనుక ఎవరు ఉన్నారన్నది స్పష్టంగా చెప్పొచ్చు. ప్రస్తుతం పార్టీని ప్రకటిస్తున్నారు కాబట్టి ఈ పార్టీ వెనుక అంతరార్థం మాత్రం ఇప్పటికీ అర్థం కావడం లేదు.

బీసీ కులాల ఓట్లే లక్ష్యం

కొత్త పార్టీకి ముఖ్యంగా బీసీ కులాల ఓట్లే ప్రధాన లక్ష్యంగా అజెండా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బీసీ వర్గాలకు రాజ్యాధికారం అనే ప్రధాన కాన్సెప్ట్ తో కొత్త పార్టీని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బీసీ ఓటర్లు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో జగన్ కు మద్దతు పలికారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఆయా పార్టీలోని ప్రధానమైన బీసీ ఓటర్లను కచ్చితంగా తమవైపు తిప్పుకోవాలి అన్నది ఈ పార్టీ లక్ష్యం. బోడే రామచంద్ర యాదవ్ దీనిలో భాగంగా ఎప్పటికీ జిల్లాల వారీగా కొన్ని వర్గాలను క్రియేట్ చేసి ప్రచారాలు మొదలుపెట్టారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరిగే మహా గర్జన సమావేశానికి సైతం అన్ని జిల్లాల నుంచి ప్రజల సమీకరణ ఉండేలా చూసుకుంటున్నారు. సమీకరణ చేసే విషయంలోనూ ఎక్కువగా బీసీ నాయకులకు పెత్తనం అప్పగించారు. అగ్రకులాలకు చెందిన నాయకులను దగ్గరకు రానివ్వడం లేదు. దీంతో కచ్చితంగా ఈ పార్టీ బీసీలకు ఒక వేదికగా పనిచేయాలని ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో సుమారుగా 45 నుంచి 55% వరకు బీసీ ఓటర్లు ఉంటారు. నిర్ణయాత్మక శక్తిగా ఉన్న బీసీ ఓటర్లకు కచ్చితంగా రాజ్యాధికారం దక్కాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ పార్టీని ముందుకు తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మూడు పార్టీలు కమ్మ,రెడ్డి,కాపు కులాలకు చెందిన పార్టీలుగా ముద్రపడ్డాయి. ఇప్పుడు బోడే రామచంద్ర యాదవ్ నేతృత్వంలోని పార్టీ కచ్చితంగా బీసీ వర్గాలకు ఒక ప్రతినిధిగా పనిచేస్తుంది అన్న భావనను కలిగించేలా పార్టీ విధానాలు రూపొందించే అవకాశం కనిపిస్తోంది. కచ్చితంగా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ, వైసీపీకి అనుకూలంగా నిలిచిన బీసీలను కొంత భాగం అయిన తమ వైపు తిప్పుకోవాలి అనేది ఈ పార్టీ ప్రధాన ఉద్దేశం. పార్టీలోకి పెద్ద నాయకులు ఎవరు వస్తారు ఏమిటి అనేది మాత్రం కొద్దిరోజుల్లోనే తెలిసే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *