fbpx

కాంగ్రెస్ ఉంటుందా ఊడుతుందా?

Share the content

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బతకాలంటే కచ్చితంగా వైసీపీ పార్టీ బలహీనం కావాలి. వైసీపీ బలహీనం కావాలంటే ముందుగా అధికారం పోవాలి. ఈ సమయం కోసమే కాంగ్రెస్ ఆశగా ఎదురుచూస్తోంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ అధికారానికి దూరం అయితే కాంగ్రెస్ రాష్ట్రంలో బలం పుంజుకునేందుకు ఉన్న అన్ని దారులను వెతుక్కుంటుంది. ముఖ్యంగా వైసిపి కనుక బలహీనమైతే ఆ పార్టీలో ఉన్న కీలక నేతలను మళ్లీ కాంగ్రెస్ వైపు తిప్పుకొని , వైసిపికి ప్రధాన బలమైన ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటు బ్యాంకు ను సైతం మెల్లగా తన వైపు తిప్పుకోవాలి అన్నది కాంగ్రెస్ పార్టీ ప్లాన్. దీనికి అనుగుణంగా తనదైన సమయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తోంది. ఇటీవల ఖమ్మం సభ ముగించుకొని ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం కొద్ది సమయం వేచి చూసే ధోరణి ఆంధ్రప్రదేశ్లో మంచిదనే భావనను వ్యక్తపరిచారు. అయితే ఆ సమయం వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నామరూపాలు లేకుండా పోతుంది అనేది ప్రస్తుతం నేతల భయం.

వచ్చే ఎన్నికలు కీలకం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇటు బిజెపి గాని అటు కాంగ్రెస్ గాని పూర్తిగా బలహీనమయ్యాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా పోయింది. భారతీయ జనతా పార్టీ ఎప్పటిలాగే తన పంథాలో తాను వెళుతుంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది అన్నది కాంగ్రెస్ పార్టీ మనుగడకు కూడా ప్రధానం కానుంది. వచ్చే ఎన్నికల్లో కనుక వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ మనుగడ అనేది దాదాపు అసాధ్యమే అని చెప్పొచ్చు. ఇప్పటికే పూర్తిస్థాయిలో బలహీనం అయిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కనుక వైసీపీ అధికారంలోకి వస్తే ఉన్న నేతలు కూడా పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎప్పటికీ వచ్చే ఎన్నికల్లో కనీసం కొన్ని నియోజకవర్గాల్లో ఆయన నాయకులను నిలబెట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఉన్న నాయకులు కూడా కేవలం పార్టీ ఫండింగ్ మీద ఆధారపడిన వారు తప్పితే సొంతంగా కార్యక్రమాలు నిర్వహించే సత్తా ఉన్న నాయకులు లేరు. దీంతో పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అదృశ్యం అయ్యేది లేనిది వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో తేల నుంది. వైసిపి కనుక అధికారానికి దూరం అయితే కచ్చితంగా ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలను తన వైపుకు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేసే అవకాశం కనిపిస్తోంది. దీని ద్వారా పార్టీకి మళ్ళీ పునరుద్యోగం తీసుకురావచ్చు అన్నది పెద్దల ప్లాన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *