fbpx

సాగర నగరం వైపు ట్రబుల్ షూటర్ ద్రుష్టి!

Share the content

భారతీయ జనతా పార్టీ నేత కీలక నేత, న్యాయపరమైన కేసుల్లో కీలక వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిలో ఉండే సీనియర్ నేత సుబ్రహ్మణ్యం స్వామి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తామని చెప్పడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఆయన బీజేపీలో ఉన్నప్పటికీ నిర్మొహమాటంగా ఆయన వైఖరిని బయట పెడతారని పేరు. న్యాయపరంగా ఎన్నో సమర్థ కేసులు ఎదుర్కొన్న సుబ్రహ్మణ్యస్వామిని రాజకీయపరంగా ఎవరు ఎదుర్కోలేరు. అయితే ఇటీవల సుబ్రహ్మణ్యస్వామి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బరిలో ఉంటానని చెప్పడంతో ఆయన ఎటువైపు స్టాండ్ తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. భారతీయ జనతా పార్టీతో తన ఆరేళ్ల ప్రయాణం అంత సంతోషంగా లేదని సుబ్రహ్మణ్య స్వామి చెప్పడం ద్వారా ఆయన మరో పార్టీలోకి మారతారా లేక వైసీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ బరిలో నిలుస్తారా అన్న కొత్త చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి.

విశాఖపట్నం నుంచి??

సుబ్రహ్మణ్యస్వామి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఇటీవల ఆయన విశాఖపట్నంలో తన మూలాలు ఉన్నాయని చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో కీలకంగా పాల్గొంటానని ప్రకటించడం పట్ల ఇప్పుడు కొత్త చర్చలు బీజం వేస్తున్నాయి. విశాఖపట్నం నుంచి వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ సుబ్రహ్మణ్యస్వామిని రంగంలోకి దింపుతుంది అన్న ప్రచారం రాజకీయ సర్కిల్లో వేగంగా జరుగుతోంది. విశాఖ ఎంపీగా ఉన్న అధికార పార్టీ నేత ఎంవివి సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో అక్కడ నుంచి కొత్త ముఖాన్ని ముఖ్యంగా నార్త్ ఇండియాకు చెందిన సుబ్రహ్మణ్య స్వామిని రంగంలోకి తెంపితే కచ్చితంగా గెలుపు సాధ్యం అనే లెక్కలను వైసీపీ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ట్రబుల్ షూటర్ గా పేరు ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి అయితే ప్రతిపక్షాలకు కూడా మింగుడు పడే అవకాశం ఉండదు. అందులోనూ విశాఖ మెట్రో సిటీలో నార్త్ ఇండియాకు చెందిన ఓటర్లు గణనీయంగా ఉన్న పరిస్థితిలో సుబ్రహ్మణ్య స్వామి అయితే కచ్చితంగా ఉత్తరాది వారి మద్దతు కూడా అధికార పార్టీకి చెందుతుంది అని భావిస్తున్నారు. జాతీయస్థాయిలోనూ విశాఖ ఎంపీగా సుబ్రహ్మణ్యస్వామి తన గళాన్ని బలంగా వినిపించ గలుగుతారు అని జగన్ లెక్కలు వేస్తున్నారు. అయితే సుబ్రహ్మణ్యస్వామి ఎటువైపు స్టాండ్ తీసుకుంటారు అన్నది కీలకం కానుంది. ఇప్పటికే ఆంధ్రజ్యోతి పత్రికపై 100 కోట్ల మీద పరువు నష్టం దావా వేసిన సుబ్రహ్మణ్యస్వామి తాజాగా శ్రీవాణి ట్రస్ట్ కు సైతం తన మద్దతు తెలిపారు. అధికార పార్టీకి ఫుల్ సపోర్ట్ చేస్తున్న సుబ్రహ్మణ్యస్వామి వేగంగా రాష్ట్ర రాజకీయాల్లో అడుగులు వేస్తే మొత్తం పరిణామాల్లో మార్పు కనిపించే అవకాశం తథ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *