fbpx

బ్రో మాకొద్దు బ్రో

Share the content

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఆయన సినిమా రంగం మీద పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈనెల 28వ తేదీన పవన్ కళ్యాణ్ అతిధి పాత్రలో నటించిన బ్రో సినిమా విడుదల సందర్భంగా కొత్త కష్టాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని బలంగా భావిస్తున్న వైసిపి వచ్చే ఈ సినిమాను కూడా కీలకంగా అడ్డుకొని పూర్తిగా నష్టపరిచే ప్రయత్నం చేయడానికి సిద్ధమవుతోంది. దీంతోపాటు ఈ సినిమాను పూర్తిస్థాయిలో అధిక ధరలకు కొనేందుకు కూడా ఎగ్జిబిటర్లు ముందుకు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాగో టికెట్ ధరలను పెంచకుండా చేస్తుందని దీనివల్ల సినిమాను అధిక ధరలకు కొన్న తీవ్రమైన నష్టం తప్పదని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. భవిష్యత్తులోనూ పవన్ కళ్యాణ్ సినిమాను కొంటె అది ఖచ్చితంగా నష్టాలు బారిన పడేలా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయాలని వైసిపి ప్లానింగ్ లా కనిపిస్తోంది. దీనికి తగినట్లుగానే ఈ నెలలో విడుదల కానున్న సినిమా సైతం రకరకాల నిబంధనలు విధించేందుకు వైసీపీ సంసిద్ధం అవుతోంది.

అమ్మో వద్దులే

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఓపెనింగ్స్ భారీగా వస్తాయి. అయితే దీనికి తగినట్లుగానే సినిమా బడ్జెట్ కూడా ఉంటుంది. బ్రో సినిమాకు కేవలం పవన్ కళ్యాణ్ రెమ్యూనికేషన్ 50 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు సినిమా చిత్రీకరణకు మరో 20 కోట్ల వరకు పెట్టుబడి అయింది. సినిమాకు బ్రేక్ ఈవెన్ రావాలంటే ఖచ్చితంగా 70 కోట్ల పైబడి వసూళ్లు అవసరం. పవన్ కళ్యాణ్ సినిమా భారీ ఓపెనింగ్స్ కు కచ్చితంగా సగభాగం వసూళ్లు వచ్చినప్పటికీ, మిగిలిన శకం ప్రభుత్వం ఏమాత్రం సహకరించకపోయిన పోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఆంధ్ర లోని 6 ఎగ్జిబిటర్లు కలిపి 40 కోట్లకు, నైజం ప్రాంతంలో 30 కోట్లకు, సీడెడ్లు 13 కోట్లకు కొన్నట్లు సమాచారం. అయితే సినిమా అటు ఇటు అయితే మాత్రం ఈ మొత్తంలో తేడా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే సినిమా కాస్త హిట్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా 100 కోట్లు మార్కు దాటే అవకాశం ఉంది. దీంతో మొదటి ఆట నుంచే సినిమా మీద నెగిటివ్ టాక్ తీసుకురావడంతోపాటు సినిమా ప్రదర్శనలు నిబంధనల ప్రకారం వేయాలని వైసిపి కచ్చితంగా ధియేటర్లో అభిమానులపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు ఎగ్జిబిటర్లు బ్రో సినిమా విషయంలో ఏం చేద్దాం అని ఆలోచనలో పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *