fbpx

మూడో విడత వారాహి యాత్ర ఆ జిల్లా నుంచే..

Share the content

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు గోదావరి జిల్లాలో మంచి స్పందన వచ్చింది. పూర్తిస్థాయిలో మొదటి రెండు షెడ్యూలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు మూడో షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుంది ఎక్కడి నుంచి మొదలవుతుంది అన్న ప్రశ్న జన సైనికులతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా ఆసక్తి కలిగిస్తున్న అంశం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి మీడియా అటెన్షన్ మొత్తం మారిపోయింది. దీనికి తగినట్లుగానే మొదటి సభలోనే పవన్ కళ్యాణ్ వాలంటీర్ల విషయం ఎత్తుకోవడంతో అది రెండో షెడ్యూల్ మొత్తం ఆక్రమించింది. ప్రజల్లోనూ రాజకీయ పార్టీలోనూ విస్తృత చేర్చుకు దారి తీయడంతో పాటు అధికార పార్టీ సమాధానం చెప్పలేని స్థితిలో పడింది. దానిని కొనసాగిస్తూ వాలంటీర్ల అంశాన్ని అధినేత విస్తృతం చేసే పనిలో విజయం సాధించారు. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు వాలంటీర్లు ఏది అడిగితే ఆ సమాచారం టక్ మనీ ఇచ్చే ప్రజలు కూడా ఇప్పుడు వారి వైపు అనుమానంగా చూస్తున్నారు. జనసేన అని ప్రసంగాలకు ప్రజల నుంచి అనుకూల స్పందన వస్తుండడం అధికార పార్టీలో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

మూడో విడత ఎటు?

ఓ పక్క సినిమాలను మరోపక్క రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకొని ముందుకు సాగుతూ విరామం లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మూడో విడత షెడ్యూల్ ఎటువైపు ఉంటుంది అన్న ప్రశ్న జనసేన నాయకుల్లో కూడా ఉదయిస్తోంది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటికే స్టాండ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉభయగోదావరి జిల్లాలనే టార్గెట్ చేసుకున్న జనసేనాని వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అక్కడి నుంచి ప్రభంజనం సాగించాలని బలంగా భావిస్తున్నారు. దీంతో మూడో విడత కూడా గోదావరి జిల్లాలోని వారాహి యాత్ర ఉంటుందని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో మొదలయ్యే వారాహి యాత్ర రాజమండ్రి నుంచి మొదలు కావచ్చని తెలుస్తోంది. మొదటి విడతలో తూర్పుగోదావరి జిల్లాలో కేవలం పిఠాపురం కాకినాడ ముమ్మిడివరం అమలాపురం రాజోలు ప్రాంతాలను మాత్రమే జనసేనాని టచ్ చేశారు. ఆ నియోజకవర్గాల్లో మాత్రమే సభలు నిర్వహించారు. దీంతో మూడో విడత షెడ్యూల్లో మిగిలిన నియోజకవర్గాల్లో రూట్ మ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. దీంతో రాజమండ్రిలో మూడో విడత యాత్ర మొదలుపెట్టి కవర్ కానీ నియోజకవర్గాలను పవన్ కళ్యాణ్ ఎంచుకోనున్నారు. ఎటువైపు అనుకూలంగా ఉంటుంది అన్న విషయం మీద ఇప్పటికే పార్టీ నాయకులకు రూట్ మ్యాప్ రెడీ చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సమాచారం. మూడో విడత యాత్ర కూడా ఈనెల చివరి నుంచి మొదలుపెట్టి పూర్తిస్థాయిలో కొనసాగించాలని భావిస్తున్నారు. మధ్యలో కొన్ని సినిమాల షూటింగ్ లు కాల్ షీట్లు ఉండడంతో వాటిని పూర్తి చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *