fbpx

పవన్ మంచి విషయంపై మాట్లాడారు!

Share the content

రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా ఎంత దారుణంగా జరుగుతుంది అన్న విషయాన్ని లెక్కలతో సహా కాకినాడ బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పడం క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిజమైన వాస్తవం. ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు దేశంలోనే ఒకటి లేదా రెండో స్థానాల్లో ఉండేది. మహిళలు, యువతుల పేదరికాన్ని, వారి బలహీనతలను దన్నుగా చేసుకొని ముఖ్యంగా మహిళల అక్రమ రవాణా చాలా ఎక్కువగా జరిగేది. మెజారిటీ శాతం మహిళలను వివిధ దేశాలకు వివిధ పనుల రీత్యా పంపించి, అక్కడ బందీలుగా చేసి సెక్స్ వర్కర్లుగా మార్చిన ఘటనలు ఉన్నాయి. అందులో సగం మందిని వ్యభిచార గృహాలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఇక మిస్సింగ్ అవుతున్న యువతులు మహిళలు అవయవాలను సైతం అమ్ముకున్న ఘటనలు గతంలో బయటపడ్డాయి. మిస్సింగ్ కేసు నమోదు విషయంలోనూ పోలీసులు ఎంతో తాత్సారం చేస్తున్నారు. ఒకవేళ కేసు నమోదు చేసిన దాన్ని దర్యాప్తు చేసేందుకు విచారం చేసేందుకు వారికి తగినంత సమయం ఉండడం లేదు. మహిళా పోలీస్ స్టేషన్లు దిశా పోలీస్ స్టేషన్లో అని పెట్టిన అక్కడ తగినంత మంది సిబ్బంది ఉన్న సిబ్బందిలో సరైన నైపుణ్యం కనిపించక మహిళలు యువతులు మిస్ అయితే ఇక వారు కనిపించినట్లే అయిపోతున్న ఘటనలు ఉన్నాయి.

ఇదో పెద్ద రాకెట్

రాష్ట్రంలో జరుగుతున్న మహిళలు యువతుల అక్రమ రవాణా అనేది పెద్ద రాకెట్. ప్రేమ పేరుతో వారిని మోసం చేయడం, గల్ఫ్ దేశాల్లో అత్యధికంగా జీతాలు ఇస్తారని చెప్పి తీసుకువెళ్లడం, వృద్ధులకు సేవ చేస్తే అత్యధికంగా డబ్బులు వచ్చే పనులు ఉన్నాయని చెప్పి మహిళలను తీసుకువెళ్లడం, ఇతర ప్రాంతాలు అత్యధిక వేతనాలు ఉన్నాయని చెప్పి ఆశ చూపి వారిని వెంట తీసుకువెళ్లడం ఇలా రకరకాల మార్గాల్లో మహిళల అక్రమ రవాణా జరుగుతుంది. దేశ విదేశాలకు మహిళలను అక్రమంగా పంపించేందుకు ప్రత్యేకంగా ముఠాలు ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ తంతు, తతంగం చాలా ఎక్కువగా జరుగుతుంది. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కూడా ఇది ఎక్కువే. చాలామంది యువతులు మహిళలు మిస్ అయిపోయిన వారు ఉంటే, ఎక్కువమంది మోసపూరిత మాటలు నమ్మి వ్యభిచార కూపాల్లో మగ్గిపోయి ఏమి చేయలేక మిన్న కుండి పోతున్నారు. మిస్ అయిన వారి సంఖ్య కంటే అనుకోకుండా రొంపిలోకి దిగి తర్వాత ఏమి చేయలేక ఉమెన్ ట్రాఫికింగ్ కాటుకు బలైన మహిళలు చాలా ఎక్కువ మంది ఉంటారు.

గతంలో ఓ పెద్ద ఆపరేషన్

మహిళల అక్రమ రవాణా పై గతంలో ఓ పెద్ద ఆపరేషన్ జరిగింది. ఐపీఎస్ మహిళా అధికారి జానకి షర్మిల నేతృత్వంలో మహిళల అక్రమ రవాణా మీద ముంబై కోల్కతా రెడ్ లైట్ ఏరియాల్లో అకస్మాత్తుగా దాడులు చేసి అక్కడున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతలను, మహిళలను విడిపించారు. ఈ పెద్ద టాస్క్ అప్పట్లో జాతీయ మీడియాలను సంచలనంగా మారింది. పోలీసులు విడిపించిన వారంతా మహిళల అక్రమ రవాణా బాధితులే. అప్పట్లో వరుసగా దాడులు చేయడం అలాగే ఏజెంట్లను అరెస్టు చేయడం జరిగింది. అనుమానితుల మీద కూడా గట్టి నిగా ఏర్పాటు చేయడం మిస్సింగ్ కేసులు ఏమాత్రం అలక్ష్యం వహించకుండా పరిష్కరించడం జరిగేవి. ఆ తర్వాత మళ్లీ అలాంటి పెద్ద ఆపరేషన్లు ఏవి జరగలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అలాగే ఉంది.

పవన్ కళ్యాణ్ మంచి విషయం బయట పెట్టారు

కేవలం ఆవేశంతో ఊగిపోయే విమర్శలు చేయడం తగ్గించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లెక్కలతో సహా క్షేత్రస్థాయిలో జరుగుతున్న అసలు నేరపూరిత విషయాలను బయట పెట్టడం ఆహ్వానించదగ్గ విషయం. మహిళల అక్రమ రవాణా అనేది చాలా కీలకమైన అంశం. ఇంట్లో అప్పటివరకు మన కళ్ళ ముందు ఉండే వారు ఒక్కసారిగా మాయమైతే ఆ బాధ వేదన వర్ణనాతీతం. అలాంటి విషయంపై ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సారించాలి. దీనిని రాష్ట్రంలో అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. కేవలం ఈ విషయం మీద ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోకుండా, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే ప్రయోజనం లేదు. మహిళల అక్రమ రవాణా విషయాన్ని వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకుండా వదిలేస్తే, పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తే ఇదే విషయం ఎన్నికల్లోను తీవ్ర ప్రభావం చూపే అవకాశం మెండుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *