fbpx

కనుమరుగైన ముళ్ళపూడి.

Share the content

ముళ్ళపూడి బాపిరాజు.. ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున క్రియాశీలకంగా ముందుండే నాయకుడు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బలంగా భావించిన నేత. పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ గా, జిల్లాలో కీలకనేతగా పేరొందిన ముల్లపూడి బాపిరాజు ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యారు. తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువ కావడం సొంత పార్టీ వారే ఆయనను వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతుండడంతో రాజకీయాలకు అయినంతట ఆయన గానే ఫుల్ స్టాప్ పెట్టారు.

టీడీపీ నేతలతో పొసగని వైనం

తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన ములపూడి బాపిరాజుకు ప్రతిసారి సొంత పార్టీ నేతలు నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ప్రతిసారి ఆయనను అడ్డుకునేందుకు అందరూ కలిసి రకరకాలుగా పన్నాగాలు పండడంతో ఆయన పార్టీకి దూరంగా వెళ్లిపోయారు. అసెంబ్లీలో అడుగు పెట్టాలని బలమైన కాంక్షతో పనిచేసిన ముళ్లపూడి బాపిరాజు చివరకు తాడేపల్లిగూడెం రాజకీయాల్లో సమిదగా మారారు. బాపిరాజును కనీసం టిడిపి అధినేత చంద్రబాబు కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఓ కీలక నేత జారిపోయారు. ముల్లపూడి బాపిరాజు టిడిపి నుంచి సైలెంట్ అయిపోయినప్పటికీ ఇతర పార్టీల్లోకి వెళ్ళలేదు. తెలుగుదేశం కార్యకర్తగానే చివరి వరకు కొనసాగుతానని చెప్పిన ముల్లపూడి బాపిరాజు ప్రస్తుతం సైలెంట్ గా తన పనులు తాను చేసుకుంటున్నారు. వ్యాపారాల్లో బిజీగా మారిపోయారు. తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ, గతంలో అక్కడ ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్, ఈలినానీలతో పోసగని పరిస్థితి ఉండేది. దీంతో టిడిపి అధిష్టానానికి మల్లపూడి బాపిరాజు వ్యవహార శైలి మీద అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ముళ్ళపూడి బాపిరాజును చంద్రబాబు పిలిచి మందలించినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒకప్పుడు జిల్లాలోని కీలకమైన టిడిపి నేతలలో ఒకరుగా ఉన్న ముళ్లపూడి బాపిరాజు సైలెంట్ అయిపోయినప్పటికీ ఆ పార్టీ నేతలు ఎవరు ఆయనను కనీసం పలకరించకపోవడం విశేషం. దీంతోపాటు రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని, పార్టీకి అవసరం వచ్చినప్పుడు పిలిస్తే పని చేస్తానని బాపిరాజు చెప్పడంతో ఇప్పుడు బాపిరాజు ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. ఏలూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం టిడిపి నాయకత్వం చాలా బలహీనంగా ఉంది. ఇలాంటి సమయంలో కీలక నేతలను ఆహ్వానిస్తే టిడిపికి మేలు జరిగే అవకాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *