fbpx

సైలెంట్ అయ్యారు పాపం!

Share the content

నిన్న మొన్నటి వరకు విపక్షాల మీద బూతులతో విరుచుకుపడుతూ విపక్ష పార్టీల నాయకులు మీద ఇష్టానుసారం మాట్లాడే మంత్రులు వైసీపీ కీలక నాయకులు ఇప్పుడు సైలెంట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మూకుమ్మడిగా దాడి చేసే మంత్రులు నాయకులు పూర్తిస్థాయిలో ఇప్పుడు మీడియాకు ముఖం చాటేస్తున్నారు. ఏదైనా విషయం మీద మాట్లాడేందుకు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, బందరు ఎమ్మెల్యే పేరుని నాని తప్ప మిగిలిన నాయకులు పెద్దగా మీడియాలో ఈ మధ్యకాలంలో కనిపించడం లేదు. దీనికి రకరకాల కారణాలను రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తున్న వేళ నాయకుల తీరులో మార్పు కనిపిస్తోంది అని, ఈ సమయంలో విపక్ష పార్టీల నాయకులు మీద నోరు పారేసుకోవడం వల్ల తమకే నష్టం అని నాయకులు లెక్కలు వేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి కనిపిస్తోంది.

వీళ్లంతా ఏమయ్యారు?

ఇటీవల వరకు విపక్ష పార్టీల నాయకులు ఏం మాట్లాడినా దానిని ఖండించేందుకు అలాగే గట్టి కౌంటర్ ఇచ్చేందుకు నగిరి ఎమ్మెల్యే మంత్రి రోజా ముందు వరుసలో ఉండేవారు. ఆమె పూర్తిగా ఈ మధ్యకాలంలో చల్లబడినట్లు కనిపిస్తోంది. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా విపక్షాల మీద ఇష్టానుసారం నోరు పారేసుకునేవారు. అయితే అనిల్ తీరులో మార్పు, స్థానికంగా స్వపక్షంలోనే విపక్షం ఏర్పడడంతో ఇల్లు చక్కదిద్దుకునేందుకే ఆయనకు ఖాళీ లేకుండా పోతోంది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా జోరుగా స్పందించేవారు. అయితే వచ్చే ఎన్నికల్లో వెల్లంపల్లి కి టికెట్ కూడా కష్టమని సంకేతాలు వెలువడిన నేపథ్యంలో ఆయన కూడా మీడియాకు దూరంగానే గడిపేస్తున్నారు. అనకాపల్లిలో ఎదురుగాలు గుడివాడ అమర్నాథ్ కూడా తన దూకుడు తగ్గించారు. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సైతం ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో అజ్ఞాతంలో గడుపుతున్నారు. సీమ ప్రాంత ఎమ్మెల్యేలు సైతం వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం విపక్ష నాయకుల మీద ఎదురు దాడి చేయడం బాగా తగ్గించారు. ఇంటిలిజెన్స్ నివేదికల్లో పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వేస్తున్నట్లు బలంగా తెలియడంతోనే నేతల పరిస్థితుల్లో మార్పు వచ్చింది అన్నది రాజకీయ వర్గాల మాట. ఈ సమయంలో గొడవ పెట్టుకోవడం వల్ల ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉండడంతోనే మంత్రులు నాయకులు పూర్తిస్థాయిలో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్నారని కొందరు పూర్తి స్థాయిలో సైలెంట్ అయిపోయారు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఎన్నికల సమయానికి పరిస్థితి ఎలా మారుతుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *