fbpx

ఆలపాటి రాజాకు వలస స్థానమే..!

Share the content

తెనాలి నియోజకవర్గం జనసేన కు వదిలి అక్కడున్న సీనియర్ టీడీపీ నేత ఆలపాటి రాజాను గుంటూరు పశ్చిమకు తీసుకువచ్చేందుకు అంత సిద్ధం చేశారు. అలా కాని పక్షంలో గుంటూరు ఎంపీ సీటు నుంచి ఆలపాటి రాజాను నిలబెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనిపై అధినేత చంద్రబాబు ఇప్పటికే రాజాను పిలిపించి విషయం వివరించినట్లు కూడా తెలుస్తోంది. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి సంసిద్ధంగా లేరని కూడా సమాచారం. దీంతో గుంటూరు ఎంపీ స్థానం ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ స్థానంలో ఆలపాటి రాజాను సర్దుబాటు చేస్తే సులభంగా గెలుచుకు రావచ్చు అన్నది చంద్రబాబు నాయుడు ఆలోచన.

మనోహర్ కోసం..

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ చైర్మన్గా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటానని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లోను పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిన నాదెండ్ల మనోహర్ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీలో ఉంటానని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో కచ్చితంగా ఆ సీటును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరే అవకాశం 100 శాతం ఉంది. దీంతో ఇప్పటికే ఆలపాటి రాజాకు ఒక క్లారిటీ ఇచ్చి వచ్చే ఎన్నికల్లో అధినేత ఎక్కడ నిలబడమన్నా నిలబడతాను అని చెప్పకనే చెప్పారు. దీంతోపాటు క్షేత్రస్థాయిలో నాదెండ్ల మనోహర్ కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. దీంతో ఆలపాటి రాజా వచ్చే ఎన్నికల్లో వలస తప్పదని భావిస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అయితే ఆలపాటి రాజా చాలా సులభంగా గెలుచుకు వస్తారు అని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆధిపత్యం చూపే కమ్మ సామాజిక వర్గం పెద్దలు ఆలపాటి రాజాను చాలా సులభంగా గెలిపించుకోస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గుంటూరు పశ్చిమ కాకుంటే గుంటూరు ఎంపీ స్థానం నుంచి ఆలపాటి రాజా ఈసారి పనిలో నిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు మాత్రం గుంటూరు పశ్చిమ నుంచి ఆలపాటి రాజాకు టికెట్ ఇస్తే గెలుపు సులభం అని భావిస్తున్నారు. అయితే అప్పటి పరిస్థితులు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *