fbpx

వారాహి విజయవంతం అవుతుందా?

Share the content

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారాహి యాత్ర చివరకు తేది ఖరారు అయింది. ఈనెల 14 నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనం లోకి రానున్నారు. అయితే యాత్ర ఎలా జరుగుతుంది అన్నది రాష్ట్ర రాజకీయాల్లో కచ్చితంగా ఒక పెద్ద అంశమే. పవన్ యాత్రకు వచ్చే స్పందనను బట్టి రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం అవుతాయి అని చెప్పడంలో సందేహం లేదు. అయితే పవన్ కళ్యాణ్ యాత్ర సాగే తీరు ప్రస్తుతం ప్రకటించిన ప్రణాళిక అమలు అయితే కచ్చితంగా యాత్రలో కొత్త విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

భిన్నంగా.. అద్భుతంగా

యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం రోడ్ షోలకు మాత్రమే పరిమితం కారు. ఉదయం 9 గంటలకు ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమం మొదలవుతుంది. వారు చెప్పే సమస్యలను ఇతర విషయాలను పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా వింటారు. స్థానికంగా ఉండే నాయకులు వీర మహిళలతో నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితి మీద పవన్ కళ్యాణ్ సమీక్ష ఉంటుంది. అనంతరం ఆయా వర్గాల వారీగా విభిన్న రంగాల వారీగా ఉన్న ప్రముఖులతో సమావేశం తో పాటు వచ్చే ప్రభుత్వంలో ఏం కావాలి ఎలాంటి బాధలు ఉన్నాయి అన్న విషయాలను పవన్ కళ్యాణ్ స్వయంగా వింటారు. అనంతరం రోడ్ షో ఉంటుంది. బహిరంగ సభ వేదికపై ఆయా నియోజకవర్గంలోని కీలక ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. ఉదయం నుంచి విన్న బాధలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని ఆయన ప్రసంగం కొనసాగించేలా ప్రణాళిక వేశారు. యాత్రలో నిజంగా ఇది ఒక అద్భుతమైన ప్రణాళిక. కేవలం ధూతూ మంత్రంగా యాత్రను నిర్వహించడం కాకుండా ప్రజలతో మమేకమై వారికి దగ్గర ఎందుకు ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది.

అయితే సాధ్యమేనా?

తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ బలం ఎక్కువ. అక్కడి నుంచే యాత్రను మొదలు పెట్టడం చాలా మంచి విషయం అయినప్పటికీ.. ఈ విషయంలో కొన్ని ప్రతికూల అంశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు తాకిడి చాలా అధికంగా ఉంటుంది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు వారి ప్రవాహం వస్తూనే ఉంటుంది. ఈ సమయంలో ప్రజలతో పవన్ కళ్యాణ్ ఎంత మమేకం అవుతారు అన్నది కీలకమైన ప్రశ్న. వారి బాధలను విని ఇతర వర్గాల వారిని కలుసుకునేందుకు ఎంత సమయం ఆయనకు ఉంటుంది. పూర్తిస్థాయిలో సమావేశాలు జరుగుతాయా అనేది కీలకం. మొదటి విడత యాత్రలోనే ప్రణాళిక మొత్తం ఫెయిల్యూర్ అయితే కచ్చితంగా అది యాత్ర మొత్తం మీద పడే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో వారాహి యాత్ర లో ఏం జరగబోతుంది అనేది మాత్రం కీలకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *