fbpx

అవినాష్ కోసం…

Share the content

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో కొత్త మొహం రోజుకో కొత్త మాట వినిపిస్తున్నాయి. వైయస్ ఫ్యామిలీ నుంచే అవినాష్ రెడ్డి నిర్దోషి అని చెప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. సరిగ్గా అవినాష్ రెడ్డి అరెస్టు సమయంలో ఈ కీలక పరిణామాలు చోటు చేసుకోవడం, దానిని ఒక ప్రణాళిక ప్రకారం మీడియాలోకి వదలడం ప్రజల్లోకి తీసుకువెళ్లడం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా బలంగా చేస్తోంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గల కారణాలను ఎవరో ఒకరి మీద తోసి, వైసిపి తన పని చక్కబెట్టుకోవాలి అని అనుకున్నట్టు బలంగా అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వివేకానంద రెడ్డి హత్య కేసు వైసిపి మెడకు చుట్టుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుండడంతోపాటు విపక్షాలు దీనిని వచ్చే ఎన్నికల్లో ప్రధాన ఆయుధంగా వాడే అవకాశం ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డికి బహిరంగంగానే వైసీపీ మద్దతు పలుకుతోంది.

సజ్జల మాటలకు అర్ధం ఏంటీ

సిబిఐ ప్రస్తుతం చేస్తున్న దర్యాప్తు మొత్తం అవినాష్ రెడ్డి అరెస్టు చుట్టూ తిరుగుతోంది. వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా అవినాష్ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించడం ఉండదు. బలమైన ఆధారాలు దొరికితేనే ఈ కేసులో సిబిఐ ముందుకు వెళ్ళగలదు. ఇదే సమయంలో అవినాష్ రెడ్డి అరెస్టు జరుగుతుంది అని బహిరంగంగా తెలిసిన సమయంలోనే సిబిఐ ను పోలీసులు నిర్వహించడం వైసిపి కార్యకర్తలు అడ్డుకోవడం వంటి విషయాలు కచ్చితంగా ఈ కేసులో అవినాష్ రెడ్డి హస్తం ఉంది అని గారి పార్టీ నే బయటపెట్టినట్లుగా ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే వైఎస్ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఎంపీ హోదాలో అవినాష్ రెడ్డి అరెస్టు అయితే వైసీపీ మొత్తం వచ్చే ఎన్నికల్లో బదనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పార్టీకి మైలు అంటకుండా ఉండాలి అంటే అవినాష్ రెడ్డికి మద్దతు పలకడం ఒకటే శరణ్యం అని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇది వైసీపీ పతనాన్ని కూడా శాసించవచ్చని అంచనా నెలకొంది. ఈ సమయంలో కచ్చితంగా వైఎస్ అవినాష్ రెడ్డిని బయటపడేసి ఈ పూర్తి హత్య కేసును వైయస్ వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యుల మీద తోసేసి చేతులు దులుపుకోవాలి అన్నది వైసీపీ పెద్దల ప్లాన్. దీనిలో భాగంగానే కుటుంబం నుంచి ఒక్కొక్కరిని రంగంలోకి దింపి అవినాష్ రెడ్డి నిర్దోషి అని చెప్పించాలి అన్న స్క్రీన్ ప్లే ప్రస్తుతం నడుస్తోంది. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ వివేకనంద రెడ్డి హత్య కేసు వైసిపి మేడకు చుట్టుకునే అవకాశం ఉండడంతో దీని నుంచి బయట పడాలి అంటే వైయస్ కుటుంబంలోని వారు ఖచ్చితంగా వైఎస్ అవినాష్ రెడ్డికి మద్దతుగా ఉండాలి అని భావించడం వల్లనే ప్రస్తుతం వైయస్ విమలమ్మ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నట్లు దీని వెనక కూడా పెద్ద ప్రణాళికే ఉంటున్నట్లు అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల్లో జనాల ఓట్లు పొందడానికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును పూర్తిగా మలుపు తిప్పాలి అన్నది వైసిపి పెద్దల భావన. దీనికి తగినట్లుగానే కేంద్రం కూడా తగిన విధంగా సహకరిస్తుంది అని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *