fbpx

ఈ మంత్రులు సేఫ్ జోన్ లో ఉన్నట్లేనా??

Share the content

జగన్ ప్రభుత్వంలో మంత్రులకు పూర్తిస్థాయి కష్టకాలం నడుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. అత్యధిక మెజారిటీ మంత్రులు కష్టకాలంలో ఉన్నట్లు వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం కూడా లేనట్లు వారు చెబుతున్నారు. అయితే వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మాత్రం కొందరు మంత్రులకు తిరుగులేని ఆధిపత్యం కనిపిస్తోంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వారు తప్ప మరొకరు గెలవని పరిస్థితి కూడా అక్కడ రాజకీయ పరిస్థితుల వల్ల స్పష్టంగా కనిపించడం చెప్పుకోవచ్చు. జగన్ మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేస్తున్న కీలకమైన మంత్రులు వచ్చే ఎన్నికల్లో సులభంగా గెలుస్తారని కొందరు మాత్రం టఫ్ ఫైట్ ఎదుర్కొంటారని, మరి కొందరు పూర్తిగా రెడ్ జోన్ లో ఉన్నారని ఇటు ఇంటిలిజెంట్ తో పాటు ఎప్పటికీ కొన్ని మీడియా సంస్థలు కూడా లెక్కలు వేస్తున్నాయి.

కచ్చితంగా గెలిచే వారిలో..?

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే మంత్రి సీటు ఏదైనా ఉంది అంటే వందకు వందశాతం పుంగనూరు నియోజకవర్గం చెప్పుకోవచ్చు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరు నియోజకవర్గంలో ఆయనకు బలమైన ప్రత్యర్థి లేకపోవడం, విపక్షాల్లో కూడా బలహీనమైన వ్యక్తులు ప్రతిసారి ఆయనకు ప్రత్యర్ధులుగా నిలబడడం చూస్తుంటే వచ్చి ఎన్నికల్లో పెద్దిరెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అని తెలుస్తోంది. రాజకీయంగా అత్యంత బలమైన స్థానంగా అక్కడ పరిస్థితి కనిపిస్తోంది. ఇక రెండో స్థానం కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు గా చెప్పవచ్చు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉన్న గంగాధర నెల్లూరులో నారాయణ స్వామికి బలమైన ప్రత్యర్థి ఇప్పటికీ దొరకడం లేదు. తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి బలమైన ప్రత్యర్థిని దింపాలని పలుసార్లు ప్రయత్నించిన ఈ నియోజకవర్గంలో అంతటి జనాదరణ కలిగిన నాయకులు ఎవరూ కనిపించడం లేదు. నారాయణస్వామి మీద నియోజకవర్గంలో కాస్త వ్యతిరేకత కనిపిస్తున్నప్పటికీ ఆయనకు దీటుగా ఎదుర్కొనే వ్యక్తి ఎవరు ఇక్కడ లేకపోవడం ఆయనకు కలిసి వచ్చే అంశం. కడపలోను అంజద్ భాషా గెలుపు ఈసారి సులభంగా మారవచ్చు అని తెలుస్తోంది. వివాదరహితుడిగా పేరు ఉన్న అంజాద్ భాష ముస్లిం మైనారిటీ ఓట్లను చాలా సులభంగా కొల్లగొట్టగల వ్యక్తి. ఆయన కూడా కడప అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రత్యర్థి పార్టీలో బలమైన అభ్యర్థులు లేరు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా మైనార్టీ వర్గం నుంచి ఇక్కడి నుంచి కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావిస్తోంది. అయితే పూర్తిగా ప్రజల్లో కలిసి ఉంటారు అని పేరు అంజాద్ భాష వచ్చే ఎన్నికల్లో సులభంగానే గెలవచ్చు అని తెలుస్తోంది. మరో సీనియర్ మంత్రి ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణ కూడా వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బొత్స సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో కూడా చీపురుపల్లి నుంచే పోటీ చేయవచ్చు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి బలమైన నాయకులు అలాగే బొత్స సత్యనారాయణను ఢీకొట్టగల ప్రత్యర్థి లేకపోవడం ఆయన గెలుపు కూడా చాలా సులభంగానే దక్కవచ్చని ఊహగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత కారణంగా చీపురుపల్లి నియోజకవర్గం లో కాస్త వ్యతిరేకత ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. ఇక తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా గెలవవచ్చు అన్న ప్రచారం కూడా బలంగా ఉంది. తుని నియోజకవర్గంలో యనమల ఫ్యామిలీ కు ఉన్న వ్యతిరేకత కారణంగా దాడిశెట్టి రాజాకు ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్ కేటాయిస్తారు అన్నది స్పష్టత లేదు. దీంతో పాటు స్థానికంగా యనమల కుటుంబం ఆధిపత్యం ఇక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కచ్చితంగా ప్రత్యర్థి మీద ఉన్న వ్యతిరేకత రాజాకు వరంగా మారే అవకాశం కనిపిస్తోంది. సర్వేపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా స్థానికంగా బలం పెంచుకున్నారు. సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి కుటుంబం ప్రతిసారి పోటీ చేసిన ఇప్పటివరకు విజయం సాధించలేదు. ఆ నియోజకవర్గంలో సోమిరెడ్డి కుటుంబం వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతిసారి పోటీ చేసిన సోమిరెడ్డి అక్కడి నుంచి ఘోరంగా ఓడిపోతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన వైఖరి మీద దృష్టి పెట్టలేదు. ఇది కచ్చితంగా ప్రత్యర్థుకి వరంగా మారుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *