fbpx

ఆ రెండు మాత్రమే టీడీపీకా.??

Share the content

మాజీ హోంమంత్రి హరి రామ జోగయ్య తాజాగా విడుదల చేసిన లేక ఇప్పుడు రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా జనసేన టిడిపి పొత్తులో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం రెండు మాత్రమే టిడిపికి బలంగా ఉన్నాయి అంటూ ఆయన విడుదల చేసిన లేక ఇప్పుడు టిడిపి శ్రేణులు కోపానికి కారణం అయ్యేలా చేస్తుంది. పాలకొల్లు దెందులూరు నియోజకవర్గం మాత్రమే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపికి కేటాయించాలని మిగిలిన 13 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయాలని ఆయన చెబుతూ లేఖ విడుదల చేయడం రాజ రాజకీయ పరిణామాల్లో కీలక అంశం.

మిగిలిన వాటి సంగతి??

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సిట్టింగ్ స్థానంగా ఉన్న ఉండి నియోజకవర్గాన్ని కూడా టీడీపీ కి కేటాయించాలి అని హరిరామ జోగయ్య చెప్పలేదు. దీంతోపాటు మెట్ట ప్రాంతాల్లో ఉన్న చింతలపూడి పోలవరం నియోజకవర్గం సైతం జనసేనకు కేటాయించాలని ఆయన చెప్పడం విశేషం. జనసేన పార్టీ బలంగా ఉన్నచోట అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించమనడం వరకు బాగానే ఉన్నప్పటికీ మిగిలిన నియోజకవర్గాల్లో సైతం, టిడిపి బలంగా ఉన్నచోట కూడా జనసేనకు ఇవ్వాలని చెప్పడం ద్వారా రెండు పార్టీలు కార్యకర్తల మధ్య ఆజ్యం పోసినట్లు అవుతుంది. ఆచంట నియోజకవర్గం లో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఉన్నారు. అలాగే భీమవరం నియోజకవర్గం లో టిడిపి నుంచి జి రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అభ్యర్థులు అయ్యే అవకాశం ఉంది. కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఈసారి జవహర్ ను నిలబెట్టే యోచనలో తెలుగుదేశం ఉంది. అలాగే ఉంగుటూరు నుంచి గన్ని వీరాంజనేయులు వరుసలో ఉన్నారు. వీరందరినీ కాదని కేవలం టిడిపి రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది అని చెప్పడం ద్వారా ఇప్పుడు కొత్త గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జనసేన టిడిపి పొత్తు గురించి రెండు పార్టీల కార్యకర్తల్లోనూ కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతున్న వేళ ఇప్పుడు తాజాగా విడుదల చేసిన లేఖ ద్వారా కొత్త వివాదం రేపినట్లుగా అవుతుంది. ఎంపీ స్థానాలు పరిధిలోని ఏలూరు నియోజకవర్గం టిడిపికి, నరసాపురం రాజమండ్రి జనసేన కేటాయించాలని ఆయన చెబుతున్నారు.

ఎందుకు అప్పుడే తొందర🤣

ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ అప్పుడే సీట్లు పంపకంపై మాట్లాడడం సరైన విషయం కాదు. గోదావరి జిల్లాలో జనసేన పార్టీ బలం పెరిగింది అన్నది స్పష్టం. ఇది ఎంత మేర పెరిగింది కాపు ఓటింగ్ ఎంత మేర ప్రభావితం చేస్తుంది అన్నది చూడాలి. ఉమ్మడి తూర్పుగోదావరిలో 19 స్థానాలు ఉమ్మడి పశ్చిమగోదావరిలో 15 స్థానాల్లో మెజారిటీ సీట్లు అడగాలి అన్నది జనసేన టార్గెట్. ఒత్తులు భాగంగా ఉభయగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు అడగడం ద్వారా చాలా సులభంగా గెలుచుకు రావచ్చు అని జనసేన పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు. ఈ కారణంగానే గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు అడిగి మిగిలిన ప్రాంతాల్లో తక్కువగా సర్దుకుపోవాలని జనసేన భావిస్తోంది. దీనిలో భాగంగానే ముందుగా హరిగామ జోగయ్య లేక ద్వారా తన మనసులోని అభిప్రాయాన్ని బయటపెట్టారు అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *