fbpx

నెహ్రూ మాటల్లో మర్మం ఏమిటి??

Share the content

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ వైఖరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు తలనొప్పిగా మారింది. నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీలోకి వెళ్తారు అని జోరుగా ప్రచారం జరిగిన జ్యోతుల నెహ్రూ తనకు తానుగా తన కొడుకు నవీన్ పేరును కాకినాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించుకోవడం, కాకినాడ ఎంపీ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎవరినైనా గెలిపించుకోవాలని జ్యోతులను ఎవరు స్వయంగా సోషల్ మీడియా వీడియో పెట్టడం ఇప్పుడు వివాదంగా మారుతుంది. దానిని పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వర్మ తీవ్రంగా ఖండిస్తున్నారు.

అక్కడ మాత్రం మీ ఇష్టం అంటూ…

తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులు ఏమాత్రం ఖరారు కాకముందే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పిఠాపురం, కాకినాడ రూరల్ మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గెలిపించుకోవాలని, కాకినాడ ఎంపీగా తన కొడుకు నవీన్ ను గెలిపించాలని ఆయన వీటి వల్ల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అది తూర్పుగోదావరి జిల్లా అంతట వైరల్ గా మారింది. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పిఠాపురం, కాకినాడ రూరల్ ఎందుకు వదిలేసారు అన్నది ప్రశ్న. కాకినాడ రూరల్ పరిధిలో తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థి అలాగే ఇన్చార్జి లేరు. పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేసరికి మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడ టీడీపీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. అయితే జ్యోతుల నెహ్రూ మాత్రం పిఠాపురం నియోజకవర్గం లో సైతం పార్టీ ఎవరిని గెలిపించమంటే వారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గెలిపించాలని కోరడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వివాదంగా మారింది. అక్కడ ఇన్చార్జిగా వర్మ ఉన్నా కూడా ఆయన పేరును ప్రస్తావించకుండా నెహ్రూ ఇష్టానుసారం మాట్లాడాలని వర్మ వర్గం భగ్గుమంటోంది.

అంటే ఆ రెండు జనసేనకా?

జ్యోతుల నెహ్రూ వదిలేసిన కాకినాడ రూరల్ పిఠాపురం నియోజకవర్గాలు వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి దక్కుతాయి అని అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు పంతం నానాజీ కాకినాడ రూరల్ లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ నుంచి 19 నానాజీ కచ్చితంగా పోటీ చేస్తారు అని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు. మరోపక్క పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈసారి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బరిలో నిలుస్తారని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. దీంతో ఈ రెండు నియోజకవర్గాలు కచ్చితంగా జనసేన పార్టీకి కేటాయించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తుండడం వల్లే జ్యోతుల నెహ్రూ ఇలా మాట్లాడారు అని కొన్ని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే జనసేన పార్టీ బలంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పార్లమెంట్ పరిధిలో రెండు నియోజకవర్గాలతోనే సరిపెట్టుకుంటుందా లేదా అన్నది మాత్రం అర్ధం కావడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *