fbpx

పొత్తులు ఉంటాయి.

Share the content

రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేలన్ ఇవ్వమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. టిడిపి తో పొత్తు ఉంటుందని మరొకసారి ఖరారు చేశారు. ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేయడం లేదని బలం చూపించే మంత్రి పదవి ఆశిస్తామని అన్నారు. గత ఎన్నికల్లో 40 సీట్లు ఉంటే సీఎం పదవి అడిగే వాడిన అన్నారు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన పొత్తు పెట్టుకుంటుందని పవన్ కళ్యాణ్ మీడియా ముఖంగా స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేయలేదు.

అకాల వర్షాలతో పంట నష్టం పోయిన రైతులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ధాన్యం కొనుగోలు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి పర్యటన అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో పొత్తుల విషయంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. తను సీఎం పదవిని డిమాండ్ చేయలేదని, జనసేన బలం చూపించే పదవి తీసుకుంటామని తెలియజేశారు. వైసీపీని అధికారం నుండి గద్దె దింపడమే ప్రధాన లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నామన్నారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే పొత్తు పెట్టుకోవాలని చెబుతున్న వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్ర ప్రజలు 40 స్థానాలు ఇచ్చుంటే సీఎం పదవిని డిమాండ్ చేసేవాడినని పరోక్షంగా ఆ డిమాండ్ ఇప్పుడు చేయడం లేదని స్పష్టం చేశారు.

బలం చూపించే పదవి తీసుకుంటాం.

2014 ఎన్నికల్లో కూడా సర్వే చేసిన తర్వాతే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు అంగీకరించామన్నారు. గతంలో కూడా బిజెపి బీఆర్ఎస్ వంటి పార్టీలు పొద్దుతోనే బలపడ్డాయి అనే సంగతిని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొత్త చేశారు. గతంతో చూస్తేజనసేన బలం మరింత పెరిగిందని గత ఎన్నికల్లో జనసేన పార్టీకి సగటు ఏడు శాతం ఓటింగ్ రాగా, ఈసారి ఆ బలం 18 నుండి 19 శాతానికి పెరిగింది అన్నారు. 2019 నుండి పూర్తిస్థాయి రాజకీయాల్లోఉన్నామని, రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకునే పొత్తుల గురించి మాట్లాడతామన్నారు. 2019 ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశామని.. అప్పట్లో కనీసం 30 నుండి 40 స్థానాలు గెలుచుకుంటేనే కర్ణాటక తరహా పరిస్థితి ఉండేది అన్నారు. పుత్రపు కొన్ని పార్టీలు ఒప్పుకోకుంటే ఒప్పిస్తామన్నారు కచ్చితంగా రానున్న ఎన్నికల్లో జనసేన గౌరవానికి భంగం కలగకుండా పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. సీఎం పదవి డిమాండ్ చేయాలంటే 30 నుండి 40 సీట్లు ఉండాలి అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి 30 సీట్లు తోని ముఖ్యమంత్రి అయిన సంగతిని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *