fbpx

ఆరోగ్యకరమైన అలవాట్లతో హైపర్టెన్షన్ కు చెక్: కృష్ణ బాబు

Share the content

ప్రజలలో ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన పెంపోందించి వారిలో హైపర్టెన్షన్ (రక్తపోటు) నివారణకు కృషి చేస్తాం” అని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖాధిపతులు‌ ,అధికారులు, వైద్య నిపుణులతో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు ప్రతిజ్ఞ చేయించారు. శుక్రవారం మంగళగిరి ఎపిఐఐసి భవనంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన అలవాట్లతో హైపర్టెన్షన్ కు చెక్ పెట్టొచ్చని స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన అలవాట్లతో రక్తపోటు నివారణకు అవసరమైన, ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకునేందుకు, ప్రజలకు అవగాహనను పెంపొందించేందుకు తాము అందుబాటులో వున్న ప్రతి వేదికనూ ఉపయోగించుకుంటామని అన్నారు. పండ్లు, కాయగూరలు, ముడిధాన్యాలు, ఉప్పు తక్కువగా వుండే ఆహార పదార్ధాల వినియోగంతో పాటు క్రమం తప్పని శారీరక వ్యాయామాలు కొనసాగించేలా వారిలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ ప్రతిజ్ఞ ద్వారా ప్రజలలో రక్తపోటును నివారించి వారి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు పునరంకితమవుతాం” అని ఆయన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అసాంక్రమిక వ్యాధులపై రూపొందించిన ఫ్లిప్ ఛార్టులను ఆయన ఆవిష్కరించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, డిఎంఇ డాక్టర్ నరసింహం , డిహెచ్ డాక్టర్ పద్మావతి, ఏడీ డాక్టర్ అనిల్ కుమార్, ఎన్ హెచ్ఎం ఎస్పీఎం డాక్టర్ దుంపల వెంకటరవికిరణ్ , ఎన్సీడీ రాష్ట్ర నోడలాఫీసర్ శ్యామల, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *