fbpx

అక్రమ ఇసుక తవ్వకాల్లో జగన్మోహన్ రెడ్డినే ప్రధాన సూత్రధారి : నక్కా ఆనందబాబు

Share the content

రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలుపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వెంటనే కమిటీలను ఏర్పాటు చేసి ఇసుక దోపిడీ దారులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాల్లో సిఎం జగన్మోహన్ రెడ్డినే ప్రధాన సూత్రధారి,పాత్రధారి అని ఆరోపించారు. శుక్రవారం మంగళగిరిలో టిడిపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.జేపీ వెంచర్స్,జిసికేసి, ప్రతిమ కంపెనీలు…. మైనింగ్ లో ఎటువంటి అనుభవం లేని బినామీ కంపెనిలను సృష్టించి…తాడేపల్లి ప్యాలెస్ కు వేలకోట్ల రూపాయలును ఎలా కట్టబెట్టారో మంత్రి పెద్దిరెడ్డి,సి.ఎస్ జవహర్ రెడ్డి , ధనుంజయ రెడ్డి, డి.ఏం.జి. వెంకట రెడ్డి లు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. కమిటీలో అధికారి రాష్ట్ర ప్రభుత్వ అధికారి వలే కాకుండా..సుప్రీం కోర్టు నియమించిన అధికారిలా వ్యవహరించాలి అని సుప్రీం మార్గదర్శకాల్లో తెలపడంపై ప్రభుత్వం సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్జీటీ, సుప్రీం కోర్టు లు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లెక్కేలేదు. నిన్న సుప్రీం మార్గదర్శకాలు విడుదల చేసినా… నేడు యదేచ్చగా అక్రమ త్రవ్వకాలు జరుగుతున్నాయని విమర్శించారు.రాష్ట్రంలో ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయని .. వీటి మీద విచారణ జరపాలని 2023 మార్చి లో ఎన్జీటి ఆదేశాలు ఇచ్చింది. భారీ యంత్రాల సహాయంతో ఇసుక త్రవేస్తున్నారని 2024 లో ఏంఓఎఫ్ సీసీ రిపోర్ట్ ఇచ్చింది. దానిపై 22 జిల్లాల కలెక్టర్లు మాత్రం… అక్రమ తవ్వకాలు ఏమీ జరగడం లేదని ఒకే విధమైన నివేదిక ఇచ్చి కోర్టులను మభ్యపెట్టారని మండిపడ్డారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులను జైలు ఊచలు లెక్కబెట్టే విధంగా చేస్తామని హెచ్చరించారు. రూ .43,000 కోట్ల విలువైన అక్రమ ఇసుక తవ్వకాలు జగన్ కనుసన్నల్లోనే జరిగాయని చంద్రబాబు సాక్ష్యాధారాలతో సహా 2023 లో నిరూపించారన్నారు. గతంలో ఉచిత ఇసుక పాలిసి తీసుకువచ్చి ప్రజలకు మేలు చేస్తే దాని మీద అక్రమాలు జరిగాయని చంద్రబాబు మిద కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *