fbpx

చెక్ పోస్టులు వద్ధ నిరంతర పర్యవేక్షణ : బలరాం మీనా

Share the content

చెక్ పోస్టుల వద్ధ విధులు అత్యంత జాగ్రత్తగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల పోలిస్ పరిశీలకులు బలరాం మీనా అధికారులను ఆదేశించారు. ఓటర్ల ను ప్రభావితం చేసే క్రమంలో బహుమతుల పంపిణీ చెయ్యకుండా నిరంతర పర్యవేక్షణతో బాధ్యతలను నిర్వహించాలని అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక జగన్నాథపురం, ఉండ్రాజవరం చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. అనంతరం అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బలరామ్ మీనా మాట్లాడుతూ….జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 15 చెక్ పోస్ట్ లలో ఆయా ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలు పై దృష్టి సారించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సమీకృత చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహించే క్రమంలో సంతృప్తికరంగా ఉందని తెలిపారు. రానున్న ఆరు రోజులు మరింత నిబద్దత కలిగి విధులను నిర్వర్తించాలని కోరారు. చెక్ పోస్ట్ లో వద్ద నిర్వహించే తనిఖీలు ఖచ్చితంగా విడియో రికార్డింగ్ చెయ్యలన్నారు. తనిఖీల సందర్భంలో సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉచితాలని పంపిణీ కోసం వివిధ రాజకీయ పార్టీలు,అభ్యర్థులు ఖచ్చితంగా ప్రయత్నం చెయ్యడం జరుగుతుందనీ, వాటినీ నియంత్రణ చెయ్యడం లో చెక్ పోస్ట్ వద్ద విధుల్లో ఉండే సిబ్బంది పనితీరు ద్వారా నివారణ సాధ్యం చెయ్యగలమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *