fbpx

అర్హులను జల్లెడ పట్టడం జగన్ విధానం…అనర్హులను జల్లెడ పట్టడం చంద్రబాబు విధానం : సజ్జల రామకృష్ణా రెడ్డి

Share the content

వైసిపి ఎన్నికల మేనిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా “జగన్‌ కోసం సిద్ధం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే సిద్ధం పేరిట నాలుగు బహిరంగ సభలు, మేమంతా సిద్ధం, పేరుతో బస్సు యాత్రల ద్వారా వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్‌లో నూతన ఉత్సాహాన్ని నింపారని చెప్పారు.గురువారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇతర పార్టీలకు ఉన్నట్లు వైయస్‌ఆర్సీపీకి సీని హిరోలు స్టార్‌ క్యాంపెయినర్లుగా లేరని
.. పేదలే వైసీపీ స్టార్‌ క్యాంపెయినర్లని అన్నారు. రాష్ట్రంలోని అన్ని తరగతుల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైసిసి ప్రభుత్వ పాలన ఈ ఐదేళ్లకాలంలో సాగిందన్నారు.అర్హత ఉన్నవారిని జల్లెడ పట్టి సంక్షేమ పథకాలు అందించడం జగన్ విధానం ఐతే…జల్లెడ పట్టి అనర్హులను గుర్తించడం చంద్రబాబు విధానం అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన ఎజెంట్ల ద్వారా కోర్టులో కేసులు వేయించి ఫించనధారులని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత ఎన్నికలకు రెండు నెలలు ముందుగా ఫించన్1000 రూపాయలు నుంచి 2000 పెంచారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా? టీడిపి కార్యకర్తలతో కూడిన జన్మభూమి కమిటీలు వస్తాయని తెలిపారు.

చట్టం తెచ్చిన బిజెపిని ప్రశ్నించరా?

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెచ్చిన బీజేపీని చంద్రబాబు ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.చట్టం పై వైసీపీని విమర్శించడం సరికాదన్నారు. చట్టంపై ఏపీ బీజేపీ శాఖ స్పందించాలని డిమాండ్‌ చేశారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోకు బీజేపీ సహకారం లేదని తెలిపారు. ఎక్కడైనా కూటమిలోని అందరికి సమ్మతమైతే మేనిఫెస్టోను విడుదల చేస్తారు ….అందుకు భిన్నంగా రాష్ట్రంలో పరిస్థితి ఉందన్నారు. నిరుద్యోగ భృతి అందరికీ ఇస్తారా, కొందరికి ఇస్తారా వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోను వైయస్‌ఆర్‌సీపీ స్టార్‌ క్యాంపెయినర్లతో కలిసి నేతలు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో పాల్గనున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా.. ఇప్పటికే 2019 మేనిఫెస్టోలోని వాగ్దానాలను 99 శాతం నెరవేర్చి ప్రజల్లో స్థిరమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఏర్పరుచుకున్న వ్యక్తి జగన్‌ అని చెప్పారు. నేటి నుంచి చేపట్టబోయే జగన్‌ కోసం సిద్ధం కార్యక్రమం ద్వారా స్టార్‌ క్యాంపెయినర్లు, పార్టీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు మేనిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లి వివరించనున్నారని వెల్లడించారు. ఏపీలో గత ఐదేళ్లలో 87 శాతం పేదలకు పథకాలు అందాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

2019-24 మధ్య అమలు చేసిన సంక్షేమం.. ఈ దఫా అధికారంలోకి వస్తే కొనసాగిస్తామని సీఎం జగన్‌ చెప్పారో వాటిని వివరిస్తారు. ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ఏం చేయబోతుందనేది తెలియజేసేందుకు క్యాలెండర్‌ రూపంలో మేనిఫెస్టోను ఇంటింటికీ అందిస్తామన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం వివరాలు ఆ క్యాలెండర్‌లో పేర్కొన్నామన్నారు. చంద్రబాబులాగా మేనిఫెస్టోను పక్కన పడేసే విధంగా కాకుండా.. ఒక ప్రామాణికంతో రికార్డెడ్‌గా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమ మేనిఫెస్టో హామీలను అమలు చేయకపోతే నిలదీసే హక్కు ప్రజలకు ఉందని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ తరఫున 12 మంది స్టార్‌ క్యాంపెయినర్లను ఎంపిక చేశామన్నారు. వివిధ సామాజిక వర్గాల నుంచి వీళ్లను ఎంపిక చేసి ఈసీకి అందజేశామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *