fbpx

డి.బి.టి, ఇంటింటికీ పద్ధతిలో పింఛన్లు పంపిణీ : కలెక్టర్ జే.నివాస్

Share the content

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పంపిణీ చేస్తున్న సామాజిక భద్రత ఫించన్లను మే, జూన్ నెలలో డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్) తో పాటు, ఇంటింటికి పంపిణీ కూడా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టరు జె.నివాస్ తెలిపారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో పింఛన్ల పంపిణీ పై జిల్లా కలెక్టర్ జె.నివాస్.. అధికారులతో కలిసి పాత్రికేయల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రానున్న మే, జూన్ నెలలో సామాజిక భద్రత కొరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఫించన్లు డీబీటీ విధానంతో పాటు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఇంటింటికి పద్ధతిలో పంపిణీ చేస్తామని అన్నారు. జిల్లాలోని 2,80,662 పింఛన్ దారులలో 2,13,195 మందికి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఫించన్ సొమ్ము జమ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన 67,467 మంది దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, వివిధ ఆరోగ్య కారణాలతో మంచానికే పరిమితమైన వారు, వీల్ చైర్స్ లో ఉన్నవారు, సైనిక పింఛన్ పొందేవారు, వితంతువులకు ఇంటి వద్దనే అందిస్తామని తెలిపారు. లబ్ధిదారులు ఎవరు పింఛన్ కోసం గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈమేరకు ఎవరికి ఏ విధంగా పింఛన్ పంపిణీ చేయాలనే అంశంపై గ్రామ, వార్డు సచివాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని ఆయన వివరించారు.

పంచాయతీ, వార్డు సెక్రటరీలు మంగళవారం బ్యాంకుల నుంచి పింఛన్ సొమ్ము డ్రా చేసుకుని మే 1 నుంచి పింఛన్ పంపిణీ చేస్తారన్నారు. పింఛన్ల కోసం వృద్ధులు, నిస్సహాయులు కంగారు పడనవసరం లేదన్నారు‌. డిబిటి పంపిణీ విధానంలో ఆధార్ నెంబర్ కి అనుసంధానం చేసిన లబ్దిదారుల బ్యాంకు ఖాతాలోనే ఫించన్ సొమ్ము జమ చేయడం జరుగుతుందన్నారు. ఏదైనా కారణం చేతనైనా ఎవరికైనా బ్యాంకు ఖాతాలో పింఛన్ సొమ్ము జమ కాకపోతే అటువంటి వారి వివరాలను సేకరించి, మే 3వ తేదీ లోపు వారికి కూడా ఇంటి వద్దనే అందిస్తామని స్పష్టం చేశారు. ఫించన్ల పంపిణీపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు.

అనంతరం సాధారణ ఎన్నికలు 2024 నిర్వాహణలో భాగంగా కాకినాడ జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్..మీడియా ప్రతినిధులకు వివరించారు. ఫారం -6 ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించామని తెలిపారు. జిల్లాలో మొత్తం 16,34,122 మంది ఓటర్లు ఉన్నారన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిఎల్వోలతో ఓటర్ల స్లిప్స్ పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నామని తెలిపారు.

హోమ్ ఓటింగ్ పద్ధతిలో 621 ఓటర్లు

ఓటర్ల చైతన్య పరుస్తూ స్లీప్ కార్యక్రమాలతో పాటు, ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలో తెలిపే ఓటర్ గైడ్ పంపిణి చేస్తున్నామన్నారు. ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా దివ్యాంగులకు, 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు హోమ్ ఓటింగ్ అవకాశం కల్పించిందన్నారు. ఈ పద్ధతిలో జిల్లాలో 621 మంది హోమ్ ఓటింగ్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ వివరించారు.జిల్లాలో ఇప్పటివరకు సి-విజిల్ యాప్ ద్వారా 297 కేసులు నమోదు చేశామన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, పోలీస్, ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా రెండు కోట్ల ఒక లక్ష రూపాయల నగదు, 19.66 కోట్లు విలువచేసే మద్యం, వివిధ ప్రలోభ వస్తువులు ఇప్పటివరకు జిల్లాలో స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సక్రమంగా అమలు చేసే క్రమంలో ఇప్పటి వరకు జిల్లాలో 39 కేసులు నమోదు చేశామన్నారు.కాకినాడ పార్లమెంటురీ నియోజకవర్గానికి సంబంధించి 18 మంది అభ్యర్థుల నామినేషన్లు పరిశీలనలో వాలిడ్ గా నిలిచాయని తెలిపారు. జిల్లాలో పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బంది అందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా మే నెల 4, 5, 6 తేదిల్లో మూడు రోజుల పాటు పెసిలిటేసన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ కార్యక్రమాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ఓటర్లకు చైతన్యం కలిగించే రీతిలో సుప్రసిద్ధ సినీ గాయకుడు కాకినాడకు చెందిన యశస్వి కొండేపూడిని స్వీప్ కార్యక్రమాలకు అంబాసిడర్ గా నియమించామని తెలిపారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్..మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ సమావేశంలో డీఆర్వో డా.డి.తిప్పే నాయక్, డీఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి.నాగార్జన ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *