fbpx

నమ్ముకున్నవవారికే టిక్కెట్లు ఇవ్వలేని దుస్థితిలో పవన్ : కన్నబాబు

Share the content

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన మ్యానిఫెస్టోలో మహిళలకు పెద్ద పీట వేసారని కురసాల కన్నబాబు తెలిపారు.ఆదివారం కాకినాడ వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాత్కాలిక ఉద్యోగులకు అండగా ఉండటం, యువతకు నైపుణ్య శిక్షణ, విద్య, వైద్యానికి పెద్ద పీట, రైతులకు మరిన్ని పధకాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి రాష్ట్ర అభివృద్ధికి రెండు పేజీల నిజాయితీ, నిబద్ధత ఉన్న మ్యానిఫెస్టో విడుదల ద్వారా మరొకసారి వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్రంలో ఆధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. ఏడు అసెంబ్లీ,కాకినాడ పార్లమెంటు స్ధానం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పవన్ రాజకీయ భవిష్యత్తు అంధకారమే

చంద్రబాబు నాయుడు కోసం రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కు సంస్కారం లేని విధంగా, అవమానకర రీతిలో మాట్లాడటం అలవాటుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సహనానికి ఓ హద్దు ఉంటుంది అని హెచ్చరించారు. 2018లో చంద్రబాబు నాయుడిని, బిజేపిని తిట్టిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. పవన్ చిరంజీవి తమ్ముడు కాకుండా ఉంటే టీ టైంలో పనిచేసుకునేవారని ఎద్దేవా చేశారు.మొదటి నుంచి పార్టీని నమ్ముకున్నవారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వలేని దుస్థితి పవన్ కళ్యాణ్ ది అని ఎద్దేవా చేశారు. ముప్పై వేల మంది అమ్మాయిలు రాష్ట్రం నుండి మాయమైంది నిజమే ఐతే కేంద్ర ప్రభుత్వం, నిఘా సంస్థలు ఏమైపోయాయి అని ప్రశ్నించారు. అన్ని అట్టర్ ఫ్లాప్ ఆరోపణలు కాదు… హిట్టయ్యే ఒక ఆరోపణ అయినా చెయ్యమని ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు నాయుడుకు తొత్తుగ మారిన పవన్ రాజకీయ భవిష్యత్ అంధకారమేనని జోస్యం చెప్పారు. పోతిన మహేష్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

చిరంజీవి అంటే తనకు అభిమానం అని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, నా జీతం లక్ష రూపాయలు అని, నేను గౌరవప్రదమైన జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నానని స్పష్టం చేశారు. చిరంజీవి సినిమా బిక్ష పెడితే కనీసం ఆయన పేరు తలవని మూర్ఖుడని ధ్వజమెత్తారు.చిరంజీవి దయవల్ల తాను రాజకీయాలలోకి రావడం నిజమని, ఆయన్ని ఎప్పుడూ గౌరవిస్తామని కన్నబాబు స్పష్టం చేశారు. పవన్ వలనే తాను రోడ్లపై తిరుగుతున్నాను అంటున్న పవన్ కళ్యాణ్…. నాకు చెప్పి గాజువాక, భీమవరంలో పోటీ చేసారా అని ప్రశ్నించారు. చిరంజీవి, ప్రభాస్ తదితరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి విషయంలో నీకు సిగ్గుందా అని నన్ను సిగ్గు లేని పవన్ కళ్యాణ్ అడగడం వెనుక అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. స్వార్థం కోసం ఒకరిద్దరు తప్ప ఏ ఒక్కరు పవన్ కళ్యాణ్ తో ఉండరని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *