fbpx

పెద్దాపురంలో ఎన్డీయే విజయం తధ్యం : చినరాజప్ప

Share the content

పెద్దాపురం నియోజక వర్గంలో ఎన్డీయే కూటమి విజయం తద్యమని టీడిపి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పెద్దాపురం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా చినరాజప్ప ఆర్టీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామం నుండి పలు గ్రామాలు మీదుగా భారీ ఎత్తున జనసేన, తెలుగుదేశం, బిజెపి నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా పెద్దాపురం చేరుకున్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, బిజెపి నాయకులు విత్తనాల వెంకటరమణ తదితరులతో కలిసి ఆర్డిఓ కార్యాలయంలో నామినేషన్ను దాఖలు చేశారు.అనంతరం పెద్దాపురం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చిన రాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మీడియాతో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *