fbpx

నమ్మకానికి….. వెన్నుపోటు రాజకీయాలకు  మధ్యనే పోటీ :  కన్నబాబు

Share the content

రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలు.. సంక్షేమ పథకాలతో ప్రజల నమ్మకాన్ని చవిచూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి… అనునిత్యం నమ్మించి వెన్నుపోటు పొడిచే చంద్రబాబునాయుడు కూటమికు మధ్య జరుగుతున్న పోటీగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని వైసిపి కాకినాడ రూరల్ అభ్యర్థి కన్నబాబు తెలిపారు.సోమవారం కాకినాడ రూరల్ వైసిపి అభ్యర్థిగా కన్నబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా కాకినాడ రూరల్ పరిధిలోని రమణయ్యపేట, సర్పవరం చుట్టుపక్కల గ్రామాలు ఫ్యాన్ ప్రభంజనంతో పులకరించింది. స్థానిక వైద్య నగర్ కన్నబాబు నివాసం వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, సినీ డైరెక్టర్ కురసాల కళ్యాణ్ కృష్ణ, జడ్పీటీసీలు నూరుకుర్తి రామకృష్ణ(కిట్టు), యాళ్ల సుబ్బారావు, ఎంపీపీలు పెంకే శ్రీ లక్ష్మీ సత్తిబాబు, గోపిశెట్టి పద్మజా బాబ్జి, కరప మండల సర్పంచుల సమైక్య అధ్యక్షుడు రొక్కాల గణేష్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగరిన్, సర్పంచ్ మరియు జేఎన్టీయూ ఎగ్జిక్యూటివ్ నెంబర్ బెజవాడ సత్యనారాయణ తదితరులతో కలిసి స్థానిక వైద్య నగర్ నుంచి వినాయక కేప్, నాగమల్లి తోట మీదుగా సర్పవరం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆర్వో ఇట్లా కిషోర్ కు కన్నబాబు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందించారు.

మూడోసారి ఫ్యాన్ ప్రభంజనం

నామినేషన్ దాఖలు అనంతరం కన్నబాబు మాట్లాడుతూ….ఫ్యాన్ ప్రభంజనం వరుసగా మూడోసారి ఎన్నికల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోందని
గ్రామీణ ప్రజలు చర్చించుకుంటున్నారు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమం తోపాటు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి మరోసారి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చలమలశెట్టి సునీల్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని కన్నబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తుంటే, చంద్రబాబునాయుడు..కూటమి నాయకులు బురదజల్లే ప్రయత్నాలు మొదలు పెట్టారని దుయ్యబట్టారు. తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. తనకు మూడోసారి కూడా అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ డైరెక్టర్ అనుసూరి ప్రభాకర్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లింగం రవి, నన్నయ యూనివర్సిటీ ఎడ్యుకేట్ నెంబర్ గొల్లపల్లి రాజకుమార్, ఉభయగోదావరి జిల్లాలో మహిళా రీజనల్ కోఆర్డినేటర్ జమ్మలమడక నాగమణి, కరప మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతా ఈశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను, సర్పంచులు రాందేవు సూర్యప్రకాశరావు, సాదే ఆశాజ్యోతి కుమార్ నాయకులు కడియాల చిన్నా, కోమల సత్యనారాయణ, పుల్ల చందు, పుల్ల కోటేశ్వరరావు, చీకాల సుబ్బారావు, నక్కా భద్రం, పాట్నీడి భీమన్న, సొగడం సూరిబాబు తదితరు నాయకులు కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *