fbpx

ఆ బిజెపి అసెంబ్లీ స్థానాల్లో ….ఎన్డీయే ఎంపి అభ్యర్థులకు భయం ఎందుకు ?

Share the content

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం మొదలయినా ఎన్డీయే కూటమికి కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో సమస్యలు తప్పడం లేదు. 175 అసెంబ్లీ ,25 ఎంపి లకు ఎన్డీయే తుది జాబితా ప్రకటించి నెల రోజులు గడిచింది. ఆయా స్థానాల్లో అభ్యర్థులు తమ ప్రచారం కూడా మొదలు పెట్టేసారు. కానీ కొన్ని స్థానాల్లో అభ్యర్థులు మార్చాల్సిందేనని ఒక ఎంపీ అభ్యర్థి అంటుంటే…..ఉన్న అభ్యర్థిని తొలగించకూడదు అని మరో ఎంపి అభ్యర్థి పట్టుబడుతున్నారు. ఆయా స్థానాల్లో బిజెపి అభ్యర్థుల కంటే టిడిపి అభ్యర్థులు నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా పాతుకు పోయి ఉండటమే కారణం గా కనిపిస్తుంది.అంతటి సీనియర్ నేతలును తప్పించి బిజెపి అభ్యర్థులకు బిఫామ్ ఇస్తే మా పరిస్థితి ఏమిటని ఎన్డీయే ఎంపి అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ గెలుపు ఓటముల మిద ఆ నిర్ణయం ప్రభావం చూపించగలదని ఎంపి అభ్యర్థులు భావిస్తున్నట్లు సమాచారం. ఆ ఎన్డీయే అభ్యర్థులు ఎవరో …ఆ అసెంబ్లీ స్థానాలు ఎంటో చూద్దాం.

ఫలించబోతున్న న్యాయం కోసం నల్లమిల్లి

రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. ఆ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో అనపర్తి అసెంబ్లీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తొమ్మిది అసెంబ్లీ , ఆరు పార్లమెంట్ స్థానాలు బిజెపికి మొదట కేటాయించారు. కానీ తమకు అదనంగా ఒక అసెంబ్లీ స్థానం కావాలని రాష్ట్ర బిజెపి నేతలు పట్టుబట్టారు. అందులో భాగంగానే అనపర్తి సీట్ ను బిజెపికి కేటాయించారు. అప్పటికే తనకు ప్రకటించిన స్థానాన్ని బిజెపికి ఎలా కేటాయిస్తారని నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఊరు తిరుగుతూ ” న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం చేపట్టారు. నల్లమిల్లి కి వస్తున్న అపూర్వ ఆదరణ టిడిపి అధినేత చంద్రబాబు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి దృష్టిలో పడింది.అందులో భాగంగానే అనపర్తి లో జరగవలసిన పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ను కూడా షెడ్యూలు నుంచి తప్పించేసారు. అనపర్తి బిజెపి అభ్యర్థి శివకృష్ణ రాజు వైసిపికి సరైన పోటీ ఇవ్వలేకపోతున్నారని సమాచారం. మరో పక్క ఇటీవలే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ని కలిశారు. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె గెలుపు చాలా కీలకంగా మారనుంది. అందుకే చర్చల్లో బాగంగా అనపర్తి టిడిపి కి ఇచ్చి దెందులూరు అసెంబ్లీ నీ బిజెపి కి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

  • తపన చౌదరి వద్దు ….చింతమనేని ముద్దు అంటున్న పుట్టా మహేష్

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని కి పెద్ద షాక్ తగిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అనపర్తి టిడిపికి… దెందులూరు బిజెపికి ఇచ్చేందుకు కూటమి నేతలు ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం.అందులో భాగంగానే కీలక నేతలను చింతమనేని నివాసానికి పంపి బుజ్జగించినట్లు తెలుస్తుంది.. చింతమనేని కానీ టిడిపి కార్యకర్తలు ఎవరు కూడా బిజెపికి ఇచ్చేందుకు సిద్ధంగా లేరని….అసలు ఈ విషయం మిద చర్చ కూడా అనవసరం అని చింతమనేని గట్టిగా బధులిచినట్లు తెలుస్తుంది. చింతమనేని కి ఏలూరు ఎంపి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. దెందులూరు టిడిపి కే ఇవ్వాల్సిందిగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. కానీ బిజెపి నుంచి తపన చౌదరి తన పట్టు విడవటం లేదని తెలుస్తుంది.ఇప్పటకే ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఉంగటూరు, పోలవరం అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది.కైకలూరు నుంచి బిజెపి అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ పోటీ చేయనున్నారు.తాజాగా దెందులూరు కూడా మిత్ర పక్షాలు కేటాయిస్తే రెండు అసెంబ్లీ స్థానాల్లో జనసేన…రెండు అసెంబ్లీ స్థానాల్లో బిజెపి అభ్యర్థుల ఉండే అవకాశం ఉంది.పార్లమెంట్ పరిధిలో ఎన్డీయే అభ్యర్థులు బలవంతులు ఆయిన చింతమనేని వదులుకునేందుకు పుట్టా మహేష్ యాదవ్ సిద్ధంగా లేరని తెలుస్తుంది. చింతమనేని పొత్తు ధర్మాన్ని పాటిస్తారా? చివర్లో షాక్ ఇచ్చిన టిడిపికి….చింతమనేని అభిమానులు టిడిపి క్రింది స్థాయి కార్యకర్తలు మద్దతు ఇస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *