fbpx

దళితులు మేనమామలని అంటూనే దాడులు హత్యలు : సరిపెల్ల రాజేష్

Share the content

దళితులు తనకు మేనమామలని అంటూనే జగన్మోహన్ రెడ్డి దాడులు హత్యలు చేయిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేష్ మండిపడ్డారు. దళితులపై హత్యలు దాడులు చేసిన వారికి పదోన్నతులు కల్పించి కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో కలిసి రాజేష్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ…..ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి మృతదేహాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేశారు. కరోనా కాలంలో మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను పిచ్చోన్ని చేసి చనిపోయేలా చేశారని ధ్వజమెత్తారు. రాజానగరంలో దళిత యువకుడు ప్రసాద్ ను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గుండు కొట్టించినా వైకాపాలో వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయకపోగా వారిని మరింత ఉన్నత పదోన్నతలనిచ్చి అగ్రభాగంలో కూర్చోబెట్టారన్నారు.దళితులకు న్యాయం జరగటం లేదని… అదే వైయస్ వివేక హత్య కేసులో సిబిఐ ముద్దాయిగా నిర్ధారించిన అవినాష్ రెడ్డిని మాత్రం అరెస్టు కాకుండా తప్పించుకు తిరగడంలో సీఎం జగన్ సహకరిస్తున్నారన్నారు. తక్షణమే ఎమ్మెల్సీలుగా ఉన్న తోట త్రిమూర్తులు, పడాల అనంత బాబులను రీ కాల్ చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రాజేష్ డిమాండ్ చేశారు.

నోరు మెదపని దళిత మంత్రులు ఎమ్మెల్యేలు

శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోటను ముద్దాయిగా తీర్పు ఇవ్వడమే కాక వెంటనే బెయిలు ఇవ్వడం ఆవేదనకు గురి చేసిందన్నారు.ఇదేమి న్యాయమంటు దళితులు పైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.చట్టంలో ఉన్న లోసుగులను ఆసరాగా చేసుకొని ఆయన బెయిల్ పొందారని పేర్కొన్నారు. శిరోముండనం కేసులో సుమారు 28 సంవత్సరాల పాటు పోరాడిన దళిత వీరులు కోట చిన్నబ్బాయి, కనికెళ్ల గణపతిలకు అభినందనలు తెలిపారు.ఎన్నో ప్రలోభాలుకు గురిచేసినా లొంగకుండా వారి పోరాటం ఎంతో స్ఫూర్తినిచ్చింది అని పేర్కొన్నారు.కేసు విషయంపై నోరుమెదపని వైకాపా దళిత మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు బతికి ఉన్నా చచ్చిన శవాలె అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత దళితురాలు అయినా ఈ తీర్పుపై ఆమె స్పందన కరువైందని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా హయాంలో దళితులపై దాడులు, హత్యలు పెరిగిపోయాయని వారికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు చాపల ప్రశాంతి, కొల్లాబత్తుల అప్పారావు, పలివెల రవి, బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *