fbpx

ప్రశాంతమైన కాకినాడను వైకాపా నుంచి కాపాడుకుందాం : ఉదయ్ శ్రీనివాస్

Share the content

కాకినాడ ప్రజలు కార్పొరేషన్ కు చెల్లించిన పన్నులను టీడిఆర్ బాండ్ల రూపంలో సుమారు రూ.750 కోట్లు ఓఎన్జికి చెందిన మత్స్యకారుల సొమ్ము రూ.1000 కోట్లు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దోచేసారని కాకినాడ సిటీ ఎన్డీయే అభ్యర్థి వనమూడి కొండబాబు ఆరోపించారు.ఆ సొమ్ము ద్వారానే కాకినాడ పార్లమెంటు పరిధిలో ఓటర్లకు ప్రలోభాలు పెట్టి వారి ఓట్లను కొనేందుకు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం కాకినాడలోని యూనివర్సల్ కమ్యూనిటీ హాలులో జనసేన ఆత్మీయ సమావేశం కాకినాడ సిటీ జనసేన అధ్యక్షుడు తోట సుధీర్ అధ్యక్షుడు జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు భారీ స్థాయిలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వనమాడి కొండబాబు మాట్లాడుతూ…. నగరంలో ఉద్యోగం ఉపాధి లేక యువత, మహిళ జీవితాలు చిత్తైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడను మాదకద్రవ్యాల వ్యాపారులు నుంచి రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. టీడీఆర్ బాండ్ల రూపంలో దోపిడీ చేసిన డబ్బుతో ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు చూస్తున్నారని వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఆ పార్టీలకు చెందిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో మరింత వేగంగా ముందుకు వెళ్లాలని తమ మూడు పార్టీల విధానాలను, పథకాలను వివరించాలని సూచించారు.ఒకప్పడు ప్రశాంత వాతావరణం కు, పెన్షనర్స్ ప్యారడైజ్ గా పేరుగాంచిన కాకినాడ …వైసిపి పాలనలో గంజాయి, కొకైన్ వంటి ఇతర మాదక ద్రవ్యాలుకు నిలయం అయ్యింది అని మండిపడ్డారు.

జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ…. కాకినాడ పార్లమెంట్ నుండి పోటీ చేయాలని అధ్యక్షులు తనకు సూచించడం ఎంతో సంతోషం కలిగించింది అన్నారు. కాకినాడ అభివృద్ధికి తన వద్ద ప్రత్యేక ప్రణాళికలు రూపొందించానని వాటిని అమలు చేసి పార్లమెంటు పరిధిలోని విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మనస్పర్ధలు వీడాలని కలిసి పనిచేసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని, స్తబ్దతగా ఉన్న నాయకులను కలుపుకోవాలని సూచించారు. కాకినాడ సిటీతో పాటు పార్లమెంట్ ప్రజలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి (బాబు) మాట్లాడుతూ…. కాకినాడలో వీర మహిళలకు, జన సైనికులకు జరిగిన అవమానం జనసేనాని పవన్ గుర్తించుకున్నారని వారికి తగినవిధంగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 120నుంచి 135 వరకు సీట్లలో గెలిచి అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు ముందుచూపు జనసేనని ఆశయాలు ఎన్నికల్లో నెరవేరుతాయన్నారు. రానున్న ఎన్నికలలో గాజు గ్లాసు, సైకిల్ గుర్తులపై ఓట్లు వేసి ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే అభ్యర్థిగా వనమాడి కొండబాబు లను గెలిపించాలని కోరారు.కాకినాడ బాలాజీ చెరువు ప్రాంతానికి చెందిన వీర మహిళ పిల్లారి శెట్టి రాజేశ్వరి మాట్లాడుతూ… ఒకప్పుడు కాకినాడలో ప్రశాంత వాతావరణ ఉండేదని ప్రస్తుతం అది కరువైందని.. అలజడులు, అక్రమాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి కాకినాడను ప్రశాంత వాతావరణంలోకి తీసుకురావాలని రాజేశ్వరి కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఇంకా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చిక్కాల దొరబాబు, పెసింగి ఆదినారాయణ, వాసిరెడ్డి శివ, తలాటం సత్య, మల్లిపూడి వీరు, నందమూరి వినోద్, మల్లాడి రాజేంద్ర, దాసరి కిరణ్, దుగ్గన బాబ్జి, నల్లం శ్రీనివాస్, పెండెం శ్రీదేవి, కొక్కిలిగడ్డ గంగరాజు, ఆకుల శ్రీనివాస్, చోడిశెట్టి శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *