fbpx

మత సామరస్యతకు ప్రతీక రంజాన్ : దుసర్లపూడి రమణరాజు

Share the content

జాతీయ సమగ్రతకు సంస్కృతీ వికాసానికీ దోహదమయ్యే పండుగల్లో మానవాళికి హితాన్ని బోధించే అంశం వుంటుందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. ముస్లింలు రంజాన్.. క్రైస్తవులు క్రిస్మస్.. హిందువులు నవరాత్రు లుగా.. జరుపుకునే భారతీయ ఉత్సవాల్లో క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతన ఉంటుందని అన్నారు. క్రోధి నామసంవత్సర రంజాన్ సందర్భంగా ఈద్గా మైదానంలో జరిగిన వేడుకల్లో రమణరాజు ముస్లింలతో నమాజ్ చేసే వరుసల్లో కూర్చుని ప్రార్థనలు చేశారు. నగర ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల అనంతరం జామా మసీదు ఇమామ్ అబ్దుల్ రజాక్ కు పుష్పగుచ్చం అందించి మత సామరస్యతకు ప్రతీకగా సంఘీభావం తెలిపారు. రజాక్ మాట్లాడుతూ ఇదే రీతిగా హిందువుల ఆదరాభిమానాలు ఎల్లకాలం కొనసాగాలని అల్లాహ్ ను వేడుకుంటున్నానని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *