fbpx

కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన పూలే : కొండబాబు

Share the content

ఆధునిక సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించి సమసమాజ స్థాపన కొరకు కృషి చేసిన మహనీయుల జ్యోతిరావు పూలే అని వనమూడి కొండబాబు కొనియాడారు. గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే 197 వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు నిర్వహించిన కార్యక్రమంలో కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా కొండబాబు మాట్లాడుతూ… అంటరానితనాన్ని నిర్మూలించి సమసమాజ స్థాపన కొరకు కృషి చేసిన మహనీయులు పూలె అని పేర్కొన్నారు.

స్త్రీ జాతి ఉద్దరణ కోసం కృషి చేసి ప్రతీ స్త్రీ చదువుకోవాలని తన భార్య సావిత్రి బాయ్ పూలె కు విద్యను నేర్పి ఆమెను పోలీసులు ఉపాధ్యాయురాలుగా మార్చి మహిళలందరిని విద్యావంతులుగా తయారు చేయాలనే ఆలోచన గల గొప్ప వ్యక్తి పూలె అని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్య దైవం మహాత్మా పూలే అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, బీసీ సెల్ నగర అధ్యక్షులు ఒమ్మి బాలాజీ, గదుల సాయిబాబా, మెంటారావు, బంగారు సత్యనారాయణ, తుమ్మల రమేష్, ఎరిపిల్లి రాము, చోడుపిల్లి సతీష్, మల్లాడి గంగాధరం, మూగు రాజు, బొంతు సత్యనారాయణ ప్రసాద్, కసింకోట చంద్రశేఖర్, మల్లాడి లోవరాజు, బొడ్డు రాజు, చీకట్ల బుజ్జి, మేరుగు రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *