fbpx

జగన్ పాలనలో ప్రజలకు కరెంట్ కోతలు ….పరిశ్రమలకు పవర్ హాలిడే : బ్రహ్మం చౌదరి

Share the content

మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని లోటు విద్యుత్ లోకి వైసిపి ప్రభుత్వం తీసుకువెళ్లిందని తెదేపా కార్యనిర్వహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి విమర్శించారు. బుధవారం మంగళగిరి లోని టీడిపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర ల కంటే మూడు రెట్లు అధికంగా ఖర్చు పెట్టీ విద్యుత్ కొనుగోలు చేసినా వేసవిలో పేద ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు గాను గ్రిడ్ డిమాండ్ 678 మెగా యూనిట్లు ఉంటే ….రాష్ట్ర ప్రభుత్వం 584 యూనిట్లు స్టాక్ పెట్టుకుంది అని పేర్కొన్నారు. రాష్ట్రంలో తక్షణమే 24 గంటలు నాణ్యత తో కూడిన విద్యుత్ ను ప్రజలకు…పరిశ్రమలకు అందించాలని డిమాండ్ చేశారు. కేవలం కమిషన్ ల కోసం బొగ్గును స్టాక్ పెట్టుకోకపోవడం వలన ఉత్పత్తికి అంతరాయం కలిగింది అని పేర్కొన్నారు.

కోల్ ఇండియా కు చెల్లించవలసిన 6000 కోట్లను ఇప్పటివరకు చెల్లించకపోవడం వలనే బొగ్గు కొరత ఏర్పడింది అని పేర్కొన్నారు. వెంటనే కోల్ ఇండియా కార్పొరేషన్ కి రాష్ట్ర ప్రభుత్వానికి కి మధ్య ఉన్న గ్యాప్ ను పరిష్కరించి బొగ్గు కోనాలని కోరారు.వారం రోజుల క్రితం నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో కరెంట్ కోతలు వలన సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులో ప్రసవం చేయాల్సి వచ్చింది అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విద్యుత్ పై చిత్త శుద్ధి లేదని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత 9529 మెగా యూనిట్ల సామర్థ్యం మాత్రమే ఉంది. దానిని 19080 మెగా వాట్లకు చంద్రబాబు పెంచారని పేర్కొన్నారు.2014 లో విద్యుత్ సామర్థ్యాన్ని ఉత్పత్తిని పెంచి ..కరెంట్ కొనే స్థాయి నుంచి 2019 కు కరెంట్ ఇతర రాష్ట్రాలకు అమ్మే వరకు కరెంట్ సామర్థ్యాన్ని చంద్రబాబు పెంచారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *