fbpx

తాడేపల్లి కోటా బద్దలవ్వాలి…జగన్ అహంకారం కూలిపోవాలి : చంద్రబాబు

Share the content

రానున్న ఎన్నికల్లో విధ్వంసం పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలా?సంక్షేమ పాలన కావాలా? సంక్షోభ పాలన కావాలా? యువతరానికి ఉద్యోగాలు కావాలా? గంజాయి కావాలా? నడుములు ఇరిగే దారుణమైన రోడ్లు కావాలా? రహదారి భద్రతా కావాలా? 10 రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దొచేసే దొంగలు కావాలా? మీ సంపద పెంచే కూటమి కావాలో ఆలోచన చేయాలని తణుకు ఎన్నికల ప్రచార సభలో టిడిపి అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. బుధవారం తణుకు లో ఏర్పాటు చేసిన ప్రజా గళం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ….పచ్చని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన వైసిపిని బూడిద చేసే సమయం ఆసన్నమైంది అని పేర్కొన్నారు. మే 13 న జరిగే ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా తీర్పుతో తాడేపల్లి కోటలు బద్దలు అవ్వాలి. జగన్ అహకరాం కూలిపోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు చేతులు కలిపాయి అని తెలిపారు.కోన ఊపిరి పైన ఉన్న రాష్ట్రానికి ఎన్డీయే ఒక ఆక్సిజన్ గా పని చేస్తుంది..రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి..ఇండస్ట్రీస్ కారిడార్ అభివృద్ధి చెందాలి అని పేర్కొన్నారు.

ఓట్లు చీలనివ్వనని పవన్ శపథం

రాష్ట్రంలో అక్రమాలను ప్రశ్నించటం కోసం పవన్ నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ పై వైసిపి నాయకులు వ్యక్తిగత విమర్శలు చేశారు.జగన్ ఒక ఫేక్ ఫెలో. మా ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో గొడవలు పేడుతున్నారు. రాష్ట్రంలో ఫేక్ ఫెలోస్ వచ్చారు.బోగస్ వ్యక్తులు వచ్చారు.దొంగలు పెట్టే ఫేక్ న్యూస్ ను నమ్మ్మద్దు అని విజ్ఞప్తి చేశారు.తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి నా కోసం పని చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు.చీకటి పాలను ను అంతం చేసే క్రమంలో ఓట్లు చిలనివ్వను అని ఆయన తెలిపారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి లో 15 కు 15 సీట్లు గెలిపించారు. నేడు జనసేన తెలుగుదేశం బిజెపి కలిసి వచ్చాం…వైసిపికి డిపాజిట్లు రాణిస్తారా అని ప్రశ్నించారు. ప్రజలు కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి లండన్ పారిపోతారని ఎద్దేవా చేశారు.శిధిలమైన రాష్ట్రాన్ని గాడిలో పెడతాం.రాష్ట్రం భవిషత్తు కోసం ఆలోచిస్తున్నాం ఆశీర్వదించండి అని కోరారు.రానున్న ఎన్నికల్లో స్వేచ్చగా ఓటు వేయండి..ఆలోచనతో ఓటు వేయండి..భవిష్యత్ కోసం ఓటు వేయండి.. మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగు వేయండి అని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *