fbpx

వైసిపి వంచనకు ఏ పేరు పెట్టాలి : కృపారాణి

Share the content

తాను వైసిపి లో కొనసాగాలి అంటే కిల్లి కృపరాణి అనే బ్రాండ్ ను పక్కకు పెట్టీ తిట్లు తిట్టాలా ? పార్టీలో కి ఆహ్వానించి ఎందుకు అన్యాయం చేశారు? అన్యాయం తో పాటు ఎందుకు అవమానించారు? ఈ వంచనకు ఏమీ పేరు పెట్టాలి అని మాజీ కేంద్ర మంత్రి ,శ్రీకాకుళం జిల్లా వైసిపి మాజీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి ప్రశ్నించారు.ఐదేళ్లుగా పార్టీ అభివృద్ధి కి కష్టపడినా… కనీసం ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇవ్వలేదని ఆమె వాపోయారు. ఐదేళ్లుగా పార్టీలో జరుగుతున్న అవమానాలకు గాను వైసిపి ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నా తమ్ముడు, విలువలు, విశ్వసనీయత ఆయనలో ఉన్నాయని భావించి ఆ పార్టీలో చేరాను. కేంద్రమంత్రి గా చేసినా తాను… అమ్మఒడి లో నుంచి జారిపడి తమ్ముడు వద్దకు చేరాను అని నమ్మాను. ఢిల్లీ లో స్పెషల్ రెప్రెంజటివ్ టూ ఏపి గవర్నమెంట్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.తరువాత లోక్ సభ భరిలో పోటీ చేయాలి అని విజయసాయి రెడ్డి చెప్పారు. అధి జరగలేదు…పార్టీలో పదవులు ఇవ్వకపోయినా పర్లేదు.ఐదేళ్లలో ముఖ్యమంత్రి ని కలిసే అవకాశమే రాలేదని వాపోయారు.సిఎం జిల్లాకి వస్తే హెలిఫ్యాడ్ వద్దకు రాకుండా జిల్లా నాయకులు ఆపారు. అవమాన భారంతో కుంగిపోతింటే…ఈరోజు నుంచి కృపరాణి చిటి చెల్లు అనే చింపే నాయకులు జిల్లాలో ఉన్నారు. కృపారాణి ని ఒక పద్దతి ప్రకారం అణచివేయాలని చూశారు. జిల్లాలో తనకు జరిగిన అవమానాలు ప్రతి విషయం జగన్ కు తెలుసని వెల్లడించారు.

ఆత్మ గౌరవమే అన్నిటికంటే పెద్దది

ఒక కేంద్ర మంత్రి గా చేశాను అనే భావన ఉండకుండా…ఒక కార్యకర్తలాగా పని చేయండి అని జగన్ చెప్పారు. ఆ విధంగానే కష్టపడ్డాను.చివరకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. టెక్కలి నియోజకవర్గ పరిధిలో ఉన్న నాలుగు మండలాల్లో 1600 మంది వాలంటిర్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా ఒక్క వాలంటీర్ ను నియమించడానికి అవకాశం ఇచ్చారా ? 136 పంచాయతిల్లో ఒక్క ప్రెసిడెంట్ అభ్యర్థిగా కృపారాణి ప్రపోజ్ చేసిన మద్దతు దారునికి ఇచ్చే పరిస్థితి ఉందా? 72 ఎంపిటిసి స్థానాల్లో కేవలం ఒకే ఒక్క బిఫాం ఇచ్చే పరిస్థితి ఉందా? ఇచ్చిన అభ్యర్థిని గెలిపిస్తే…ఓడిపోయిన అభ్యర్థిని మండల ప్రతేక ఆహ్వానితుడుగా ఇస్తారా? ఇదేనా ఒక అధ్యక్షురాలు కు ఇచ్చే గౌరవం అని నిలదీశారు.తాను అడగకుండానే ఎందుకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు? ఎందుకు అకారణంగా తొలగించారని నిలదీశారు. అన్యాయాన్ని భరిస్తాను కానీ ఆత్మ గౌరవం ను తగ్గిస్తే భరించలేను అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *