fbpx

ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించండి : తాటిపాక మధు

Share the content

మతం, కులాల పేరుతో దేశ ప్రజల్లో విద్వేషం రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఎన్డీయే కూటమి, నిరంకుశ వైసీపీ లను ఓడించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎం పల్లంరాజు ను ప్రకటించిన సందర్భంగా సీపీఐ జిల్లా నాయకత్వం ఆయనను కలిసి అభినందనలు తెలిపారు .ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ….
మతోన్మాద బిజెపి రాజకీయ చదరంగంలో వైసిపి, టిడిపి, జనసేనలు పావులేనని …వాటికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు .ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఎన్నికల బాండ్ల రూపంలో బిజెపి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు.ఈ విషయాలు ప్రజలకు తెలియకుండా ఉండే దానికోసం ప్రతిపక్ష నాయకులను ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నిరంకుశత్వంతో అరెస్టు చేస్తుందని విమర్శించారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ వనరులన్నింటిని కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టేస్తున్నారని ధ్వజమెత్తారు.రాష్ట్రానికి విభజన హామీ చట్టాలు ప్రకారం రావలసిన నిధులను ఒక పైసా కూడా ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ,రాజధాని నిర్మాణం, కడప స్టీల్ ఫ్యాక్టరీ, దుగ్గరాజుపట్నం పోర్టు, కేంద్ర విద్యా సంస్థలు విశాఖ రైల్వే జోన్ ఇవేవీ కూడా అమలు చేయకుండా అన్యాయం చేసిందని వాపోయారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కార్ప్రేట్ వ్యక్తులకు ధరతత్తం చేస్తుందని అన్నారు

పది సంవత్సరాలు కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచారని తెలిపారు. ప్రజా అనుకూలమైన చట్టాలను మార్పులు చేసి కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలను చేశారని విమర్శించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తానని హామీ ఇచ్చి ఆచరణలో అమలు చేయకుండా తుంగలోతోక్కారని విమర్శించారు. ఢిల్లీ మహానగరంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల ఆందోళన చేస్తుంటే ఆ ఆందోళన నిరంకుశంగా అణచివేయడం కోసం ప్రయత్నం చేసిందని తెలిపారు. నేడు పచ్చి ఫాసిజం లక్షణాలతో ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఈడి, సిబిఐ, ఇన్ కమ్ టాక్స్ సంస్థలను దుర్వినియోగపరుస్తూ ప్రతిపక్షాలపై దాడులకు ఉపయోగిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. దేశ ఐక్యతకు భంగం కలిగే విధంగా మతఘర్షణలు సృష్టించి ముస్లింలు, క్రిస్టియన్స్ , దళితులు పై దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో బిజెపిని ఓడించి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మధు తెలిపారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి కే బోడకొండ మాట్లాడుతూ…. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి కూటమిగా ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీలను, అలాగే నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాల అమలు చేస్తున్న వైఎస్ఆర్సిపి పార్టీలను ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశములో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ , కార్యవర్గ సభ్యులు పి . సత్యనారాయణ , కాంగ్రెస్ నాయకులు ఎం రాంబాబు, ప్రసాద్ , రాజవరపు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *