fbpx

నిరంకుశ వైసీపీ పాలనకు బుద్ది చెప్పండి …ఇండియా కూటమిని గెలిపించండి : రావుల వెంకయ్య

Share the content

ఏపీ కు ప్రత్యక హోదా ఇవ్వకుండా , పోలవరం పూర్తి చేయకుండా విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయని బీజేపీ ప్రభుత్వనకి ఏపీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గా సభ్యులు రావుల వెంకయ్య ప్రశ్నించారు. బుధవారం కాకినాడలో స్థానిక సాంబమూర్తి నగర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్
పి ఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… భారతదేశంలో మతోన్మాదం పెట్రేగిపోతుందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా బిజెపి పరిపాలన విధానాలు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవాలంటే బీజేపీని ఓడించాలని, మతోన్మాద బిజెపి పార్టీతో పొత్తులు కుదుర్చుకున్న పార్టీలను సైతం సాగనంపాలని వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో రైతన్నలు చేస్తున్న ఆందోళన పట్టించుకోకుండా నల్ల చట్టాన్ని రద్దు చేస్తానని చెబుతూనే ఆ చట్టాలను అమలు చేసే విధంగా బిజెపి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడా కార్పొరేటర్ వ్యక్తులకు ఊడిగించే విధంగా బిజెపి పరిపాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో 540 రైతు సంఘాల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ప్రదర్శన నిర్వహించామని, ఈ ప్రదర్శనలో ప్రధానంగా మోడీని గద్దినించాలని రైతు నల్ల చట్టాలను రద్దు చేయడంతో పాటుగా మోడీని ఓడించాలనే నినాదంతో రైతులందరూ ముక్తకంఠంతో నినాదిస్తున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఇతర పార్టీలను అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని… అందులో భాగంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి అమాద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ను అక్రమంగాఅరెస్టు చేశారని పేర్కొన్నారు . జార్ఖండ్ సీఎం పై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. బిజెపిని అంట కాగుతున్న పార్టీలను వెనకేసుకుంటూ ప్రశ్నిస్తున్న పార్టీలపై కేసులు బనాయించే ప్రయత్నం చేస్తూ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. మతోన్మాద పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పై అనేక కేసులు ఉన్న సై అంటే తందాన తాను అనే విధంగా జగన్ బిజెపి భజన చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బిజెపి పార్టీ టిడిపి జనసేన కు తాళి కట్టి వైసిపి తో కాపురం చేస్తున్న చందంగా బిజెపి వైఖరి వ్యవహరిస్తుందని విమర్శించారు. రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాలన్నా, రైతులు న్యాయంగా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, విద్యా వైద్య రంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి జరగాలంటే ఈ బిజెపి పోవాలని… లేకుంటే భారతదేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టే విధంగా బిజెపి కుట్ర పన్నుంతుందని అన్నారు. ఈ పాత్రికేయ సమావేశములో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, జిల్లా సిపిఐ కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *