fbpx

ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమిస్తే కఠిన చర్యలు : రిటర్నింగ్ అధికారి

Share the content

రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రచారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించి కార్యకలాపాలను నిర్వహించుకోవాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఆర్డిఓ ఇట్ల కిషోర్ సూచించారు. స్థానిక తహసీల్దారు వారి కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల్లో పార్టీలు నిర్వహించే ర్యాలీలు. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సమావేశాలుకు సంబంధించి సంబంధిత రిటర్నింగ్ అధికారి వారి నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని తెలిపారు. అనుమతులు సువిధ యాప్ ద్వారా కానీ నేరుగా రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయం నుండి గాని దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాలని సూచించారు. ఇంటింటి ప్రచారానికి కూడా తప్పనిసరిగా అనుమతులు పొందాలని తెలిపారు.రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసిన 48 గంటలలో అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రచారానికి సంబంధించి నియమావళికి లోబడి ప్రచారం చేసుకోవాలని తెలిపి ఉన్నారు.

డి.ఎస్.పి డాక్టర్ కే హనుమంతరావు మాట్లాడుతూ…. ప్రచారంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రచారం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీ ప్రతినిధులైన జనసేన పార్టీ అభ్యర్థి. పంతం నానాజీ. రావూరి వెంకటేశ్వరరావు వైకాపా. గదుల సాయిబాబా తెదేపా. కే కృష్ణమూర్తి ఆప్. ఎస్. అప్పారావు బీఎస్పీ. విజయ రామయ్య. భాజపా. నాగేశ్వరరావు సిపిఎం. టి రామ్మూర్తి జాతీయ కాంగ్రెస్. తహసీల్దార్ బి విజయప్రసాద్. డిప్యూటీ తహసీల్దార్ సురేష్. రెవెన్యూ ఇన్స్పెక్టర్ మధు. తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *