fbpx

కేజీబీవీల్లో దరఖాస్తుల స్వీకరణ

Share the content

రాష్ట్రంలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) 2024-25 సంవత్సరానికి గాను 6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులును కోరుతూ రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తు కు గడువు అని పేర్కొన్నారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ ( బడి మానేసిన వారు) పేద, ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనారిటీ, బి.పి. ఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక లక్ష ఇరవై వేలు, పట్టణ ప్రాంత విద్యార్థులకు ఒక లక్షా నలభై వేలు మించకూడదు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణింపబడతాయి. ఆన్లైన్ దరఖాస్తులు https://apkgbv.apcfss.in/ వెబ్సైట్ ద్వారా స్వీకరించబడతాయి. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది. మరియు సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చును. మరిన్ని వివరాలకు RTE Toll Free No 18004258599 ఫోన్ నంబర్లను సంప్రదించాల్సిందిగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *