fbpx

మోడీ తో జతకట్టే పార్టీలను ఓడించండి : తాటిపాక మధు

Share the content

ఆంధ్రప్రదేశ్, భారతదేశం కు తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీ తో ఎవరు జత కట్టినా వారికి బుద్ధి చెప్పేలా ప్రజలను చైతన్యం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. గురువారము సామర్లకోట స్థానిక ఏఐటుయుసి కార్యాలయములో పార్టి కార్యవర్గ సమావేశము పి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది . ఈ సమావేశనకు ముఖ్య అధితిగా పాల్గొన్న మధు మాట్లాడుతూ …. తప్పుడు నివేదికలతో పేదరికం,నిరుద్యోగం రూపుమాపినాట్లు మోడీ సర్కార్ అబద్ధాలు చెపుతున్నదనీ, దేశ ప్రజలు చైతన్యవంతులనీ, మోడీ సెంటిమెంట్ రాజకీయాలను ఇంకా సాగనివ్వరనీ స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఉందని,రానున్న ఎన్నికల్లో బీజేపీ కి మేజిక్ ఫిగర్ సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తున్నదని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆకర్షణీయ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.

రాబోయే ఎన్నికల్లో ప్రజలు ప్రజా ప్రయోజనకర పథకాలు కోరుకుంటున్నారని, అది ఇండియా కూటమితోనే సాధ్యమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పక్షం, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మోడీ అమిత్ షా కనుసన్నల్లో పనిచేస్తున్నాయని విమర్శించారు.ఈ నేపథ్యంలో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత నిరుద్యోగులతో పాటు,అన్ని వర్గాల ప్రజలపై ఉందని, ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు అన్ని మారుతాయని, రాష్ట్రంలో నూతన పరిశ్రమలు ఏర్పడి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటున్నదని ఆయన తెలిపారు.ఇండియా కూటమి వస్తే ప్రత్యక హోదా వస్తుంది అని , పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికలు , భవిష్యత్ ప్రణాళిక పై ఈ నెల 11 న జిల్లా కౌన్సిల్ వేశామని అన్నారు. ఈ సమావేశములో సీపీఐ జిల్లా కార్యదర్శి కే బోడకొండ , నాయకులు అర్జన రావు , ర్మణారావు రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *