fbpx

భారత క్రికెటర్ కంటే వైసిపి నాయకుడే ముఖ్యమా ? : పవన్ కళ్యాణ్

Share the content

ఆంధ్ర క్రికెట్ టీమ్ కెప్టెన్ హనుమ విహారిని రాష్ట్ర క్రికెట్ సంఘం దారుణంగా అవమానిస్తుంటే …రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహించి లాభం ఏమిటని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైసిపి కార్పొరేటర్ కారణంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు విహారి తన కెప్టెన్సీ కి రాజీనామా సమర్పించాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత క్రికెట్ జట్టుకి 16 టెస్ట్ మ్యాచ్ లలో ప్రాతినిధ్యం వహించి, ఐదు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించి, ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్ట్ లో హనుమ విహారి కనపరచిన క్రీడా పటిమ మరువలేనిది అని తెలిపారు. గత ఎడేళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టు ఐదు సార్లు నాకౌట్ కు అర్హత సాధించడంలో విహారి కెప్టెన్సీ సహాయపడింది.విరిగిన చేతితో పాటు ,మోకాలి గాయంతో ఆడిన విహారి…భారత జట్టు కోసం, ఆంధ్రప్రదేశ్ జట్టు కోసం తన క్రీడా శక్తినంటతని దారపోసారు అని గుర్తు చేశారు.

రంజీ టీమ్ కెప్టెన్ అయిన విహారి కంటే…ఎటువంటి క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ లేని స్థానిక వైసిపి రాజకీయ నాయకుడు ప్రభుత్వానికి చాలా విలువైన వ్యక్తిగా మారడం ఎంత అవమానకరం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చిన్న పిల్లల్లో స్ఫూర్తిని నింపి క్రీడాకారులను ఉత్తేజపరిచిన హనుమ విహారి కి ధన్యవాదములు తెలిపారు. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ హనుమ విహారి పట్ల చూపిన వివక్షతను చూసి… క్రికెట్ ను అమితంగా ఇష్టపడే వ్యక్తులుగా మీకు జరిగిన అన్యాయానికి సాటి తెలుగువాడిగా చింతిస్తున్నాము అని పేర్కొన్నారు. మీకు భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నానాను. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తో వచ్చే సంవత్సరం మళ్ళీ ఆంధ్ర తరుపున ఆడతారని విశ్వసిస్తున్నానుని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *