fbpx

సంతృప్తికరమైన రీతిలో అర్జీలు పరిష్కరించాలి : ప్రసన్న వెంకటేష్

Share the content

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాం” స్పందన కార్యక్రమంలో అందిన ధరఖాస్తులకు నాణ్యతగా పరిష్కారం చూపించడంతోపాటు సకాలంలో అర్జీలను పరిష్కరించడమే ధ్యేయంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లాస్దాయి జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, డిఆర్ఓ పుష్పమణి, హౌసింగ్ పిడి కె. రవికుమార్, డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు, సమగ్రశిక్షా అభియాన్ పివో బి. సోమశేఖర్, ఆర్డివో ఎన్ఎస్ కె. ఖాజావరి, లతో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ…. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 218 అర్జీలు అందాయన్నారు. ప్రజల నుండి అందిన విజ్ఞప్తులను ఎలాంటి పెండింగ్ లేకుండా గడువులోపల పరిష్కరించాలని ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదన్నారు. క్షేత్రస్ధాయిలో పరిశీలించిన తర్వాత పరష్కార విధానంపై ప్రజలు సంతృప్తి చెందని కారణంగా ధరఖాస్తులు రీఓపెన్ అవతున్నాయన్నారు. స్పందన ధరఖాస్తులు రీ ఓపెన్ కాని రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

అర్జీదారులకు నాణ్యతగల పరిష్కార ఎండార్స్మెంట్ అందజేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ రోజు వచ్చిన అర్జీలలో కొన్ని కొయ్యలగూడెం మండలం పొంగులూరు కు నాగేశ్వరరావు తమయొక్క భూమిని రీ సర్వే చేయించి హద్దులు కేటాయించాలని అర్జీ అందజేశారు. చింతలపూడి మండలంకు చెందిన వెంకటేశ్వరరావు తమ భూమి ఆన్ లైన్ అవ్వడంలేదని అన్ లైన్లో వచ్చేలాగా చేయుమని కోరుతూ అర్జీ అందజేశారు. భోగాపురం కు చెందిన నవ్య జగనన్న కాలనీలో తమ ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తమ పేరు కనిపించడంలేదని కావున ఆన్ లైన్లో తమ పేరు వచ్చేలాగా చేయాలని అర్జీ అందజేశారు. బుట్టాయిగూడెం మండలం బండార్లగూడెం కు చెందిన రాంబాబు తమయొక్క భూమిని గంగరాజు అనేవ్యక్తి అక్రమంగా ఆక్రమించాడని కావున విచారణ, సర్వే చేపట్టి తమ భూమిని తమకు అప్పగించవలసిందిగా కోరుతూ అర్జీ అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *