fbpx

పార్టీ ప్రయోజనాలు కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం : పవన్ కళ్యాణ్.

Share the content

ఐదేళ్ల వైసిపి పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జనసేన ,తెలుగుదేశం పార్టీల నాయకులు,కార్యకర్తలు ఐక్యతగా పని చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరారు. వైసిపి నాయకులు సిద్ధం సిద్ధం అంటున్నారు..సిద్ధంగా ఉండండి మీకు ఆపలేని యుద్ధం ఇవ్వనున్నామని హెచ్చరించారు.రాష్ట్రంలో ప్రతి పేదవాడి తరుపున బలంగా పోరాడే యుద్ధం ఇస్తాం. ఖచ్చితంగా పేదవాడి బ్రతుకులను బాగు చేసే విధంగా పోరాటం చేస్తామన్నారు.రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమి గెలవబోతుంది.దీనిలో ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం వైకాపా పాలనను పారద్రోలడానికి త్యాగాలు తప్పవని తెలిపారు.పార్టీ కోసం నిరంతరం కష్టపడే వారికి వచ్చే ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం కల్పించే భాధ్యత ను తీసుకుంటామని హామీ ఇచ్చారు.జనసేన తెలుగుదేశం పొత్తును మనస్పూర్తిగా ఆశీర్వదించెందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఆరు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు ను ఆలోచించి వైసిపి విముక్త రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపారు.రెండు పార్టీల అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో ఖచ్చితంగా బదిలీ జరగాలని ఆయన ఆకాంక్షించారు.ఇందుకోసం పటిష్ట ప్రణాళికతో పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రజల జీవితాలను విధ్వంసం చేసిన వైసిపి : చంద్రబాబు
రాష్ట్రంలో రాజకీయ స్వార్థం కోసం టిడిపి,జనసేన మధ్య ఏర్పడలేదని, రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు ఏర్పడింది అని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల భవిష్యత్తు కోసం తీసుకున్న పొత్తుల వలన సీట్లు ఆశించిన వారికి ప్రభుత్వం ఏర్పడ్డాక అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.ప్రజావేదిక విధ్వంసంతో మొదలైన వైసిపి పాలన ప్రజా జీవితాలను విధ్వంసం చేసిందని మండిపడ్డారు. వైసిపి పరిపాలనకు స్వస్తి పలకాల్సిన అవసరం ప్రజలకు ఉంది అని విజ్ఞప్తి చేశారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది.రాష్ట్రంలో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదు.ప్రశ్నించే వారిపై కక్ష కట్టి దాడులు చేస్తున్నారు. పత్రికల మీద దాడులు, అధికారుల పై బెదిరింపులు సర్వ సాధారణం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసిపి పాలనలో చూసిన అరాచకాన్ని ఎన్నడూ చూడలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైసిపి దుర్మార్గపు పాలనను పార ద్రోలేందుకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు,టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు,మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *