fbpx

ప్రతి ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నదే కొలమానంగా చూడండి : సిఎం జగన్మోహన్ రెడ్డి

Share the content

రానున్న ఎన్నికల్లో తనకు చంద్రబాబు మాదిరి ఈనాడు,ఆంధ్రజ్యోతి, టివి 5,దత్త పుత్రుడు మద్దతు లేదని..మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీరే తోడుగా నిలబడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. తాను దేవుడ్ని, ప్రజలను మాత్రమే నమ్ముకున్నానన్నారు. మధ్యలో ఉండే దళారులను,బ్రోకర్లను నమ్ముకొలేదని తెలిపారు. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నదే కొలమానంగా చూడండి అని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో అబద్ధాలు ను నమ్మకండి, మీకు మంచి చేసింది ఎవరు అనేది మాత్రమే మీ మనసులో పెట్టుకోండి.మంచి జరిగితే మాత్రం అండగా తోడుగా నిలబడాలని కోరారు. ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలేవరు సమర్థించడం లేదుని ,రాష్ట్రంలో ఓటు కూడా లేని వారు… నాన్ రెసిడెన్స్ ఆంద్రాస్ మాత్రమే చంద్రబాబు ను సమర్థిస్తున్నారని ఎద్దేవా చేశారు. “నవరత్నాలు_పేదలందరికీ ఇల్లు” క్రింద రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసిన 31.19 లక్షల ఇళ్ల స్థలాల పై మహిళలకు సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేసిన కన్వేయన్స్ డీడ్స్ అందించే కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.

పేదలకు ఒక నిభందనలు పెద్దలకు ఒక నిభందనలా ?

రాష్ట్రంలో పేద వారికి ఇళ్ల స్థలాల ఇచ్చే విధానంలో గత ప్రభుత్వంకు ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ఎంత ఉందో గమనించాలని విజ్ఞప్తి చేశారు.58 నెలలు కాలంలో వేసిన ప్రతి అడుగు, పేదల జీవితాలు మారాలి,ఆ పేద పిల్లలు ఎదగాలి..భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి రావాలి అనే విధంగా ప్రతి అడుగు వేసామన్నరు. పేదలకు ఒక న్యాయం…పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీలు లేదని, పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను కూడా …రాష్ట్రంలో ఐఏఎస్ అధికారాలకు ,ఇతర ఉద్యోగులకు ఇచ్చే పట్టాలను ఇచ్చేటప్పుడు ఏమీ నిభందనలు వర్తిస్తున్నాయో…అటువంటి నిభందనలు… అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డిడ్స్ ఇచ్చే కార్యక్రమమే ….మన పేదలందరికీ కూడా జరగాలని తెలిపారు. మొట్ట మొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం ను ప్రారంభించాము అని పేర్కొన్నారు. ఏ రాష్ట్రానికి అయిన పేదలకు ఒక రకమైన నిభందనలు….పెద్దలకు ఇంకో రకైమన్ నిభందనలు ఉండటం ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదు హితవు పలికారు.

58 నెలల్లో విప్లవాత్మక అడుగులు

77 ఏళ్ల స్వాతంత్రం తరువాత కూడా మన రాష్ట్రంలో రెండు రకాలు నిభందనలు ఉండటంపై తిరుగుబాటు చేస్తూ మన అందరి ప్రభుత్వం పరిపాలన సంస్కరణ లను తీసుకువచ్చిందని అన్నారు. 58 నెలల పాలనలో ప్రతి అడుగు కూడా విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చే దిశగా అడుగులు పడ్డాయని చెప్పటానికి గర్వపడుతున్నాను అని తెలిపారు. గ్రామ ప్రజలకు …పట్టణ ప్రజలకు అందించే పౌర సేవలు విషయం లో, ఇంటింటికీ తలుపు తట్టి అందించే సేవలు విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి అడుగులు ముందుకు వేసాముఅని పేర్కొన్నారు. పేదలకు ఒక న్యాయం, పెద్ద వారికి ఒక న్యాయం అన్న విధానాన్ని ప్రతి అడుగులోనూ కూడా మార్చాలి అనే తపన తాపత్రయం తో పడిన అడుగులును వెల్లడించారు.

గతంలో పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం, పెద్ద వారు చదివే బడుల్లో ఇంగ్లీష్ మీడియం ఉండేది. కేవలం ఇద్దరు మధ్య తేడా డబ్బులు ఉండటం మాత్రమే అని స్పష్టం చేశారు.కార్పొరేట్ బడులకు పోటీగా ప్రభుత్వ బడుల్లో నాడు_ నేడు కింద సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. మొట్ట మొదటిసారిగా పిల్లలకు చదువు కుంటున్న చదువుల్లో బ్యేజుస్ ను తీసుకొచ్చాం. ఎనిమిదవ తరగతి రాగానే పిల్లల చేతిలో త్యాబ్స్ పెట్టీ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల కంటే గొప్ప స్థాయిలో నడిపిస్తున్నామ అని తెలిపారు..పేద పిల్లలు వెళ్ళే ప్రభుత్వ బడులు మారాయి..ఆ ప్రభుత్వ బడుల్లో డిజిటల్ భోధన ఉందన్నారు. గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తో మొదలు సీబిఎస్ దాకా, సి బి ఎస్ నుంచి ఐబీ దాకా అనేక మార్పులు తీసుకెళ్తున్నామన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో ఆరోగ్య శ్రీ ప్రైజర్స్ ను ఏకంగా 25 లక్షల వరకు వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.

పేదలకు కావలసింది స్థలం…బాబు ఇచ్చింది కష్టం ..కన్నీళ్లు

పేదలకు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు..ఒక్క పేదవాడికి కనీసం ఒక్క ఇంటి స్థలమైన ఇచ్చిన పరిస్థితి లేదు.వైసిపి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అడుగు ముందుకు వేస్తుంటే…రాక్షసులు అడ్డుకునేందుకు 1191 కేసులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బాబు సృష్టించిన న్యాయ పరమైన అడ్డంకులును దాటుకుంటూ ఒంగోలు లోనే ఏకంగా 21,000 పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.ఒంగోలు అర్బన్ లో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 342 రైతన్నలు వారి దగ్గర నుంచి 536 ఎకరాలు భూమిని సేకరించి ఏకంగా 210 కోట్ల రూపాయలు ను డబ్బులు ఖర్చు చేస్తున్నాము అని తెలిపారు. ఒంగోలు లో త్రాగు నీటి నివారణ నివారించే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కు శంకుస్థాపన చేశారు.ఇళ్ల నిర్మాణం అడ్డుకుంటూ కేసుల వేయించడం ఆయనకు సహజ అలవాటుగా మారింది.

వంద మంది సినిమా విలన్ల కంటే ఒక్క బాబు దుర్మార్గం ఎక్కువ

అమరావతి పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే..పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతుల్యత దెబ్బ తింటుంది అని ఏకంగా కోర్ట్ లో కేసులు వేశారు అని విరుచుకుపడ్డారు. పేదల కోసం వైసిపి చేసిన ఈ 58 నెలల పాలన కొనసాగాలంటే మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *