fbpx

వైసిపి విముక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

Share the content

రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఐదు కోట్ల మంది ఆశలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు రాజకీయాల్లో ఉండకూడదు అనే ధ్యేయం తో టిడిపి, జనసేన కలిసి పని చేస్తున్నాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు తెలిపారు. జనసేన , తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం గురువారం విజయవాడ నోవోటెల్ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత రెండు సంవత్సరాలగా రాష్ట్రంలో ఉన్న హరిజన,గిరిజన,బడుగు బలహీన వర్గాల పైన ప్రభుత్వం చేస్తున థమనఖాండపై టిడిపి,జనసేన చేస్తున్న పోరాటం రాష్ట్ర ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

టిడిపి, జనసేన భారీ భహిరంగ సభ

తెలుగుదేశం, జనసేన రెండు పార్టీలు అధ్యక్షుల నిర్ణయం మేరకు ఈ నెల 28 న తాడేపల్లిగూడెం వద్ధ పత్తిపాడు లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుంది అని తెలిపారు. ఈ సమావేశం ద్వారా టిడిపి జనసేన కార్యకర్తలకు… రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గానికి ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడి బాధితులకు ఈ సమావేశం ద్వారా ఆహ్వానం పలుకుతున్నామని పిలుపునిచ్చారు. వీలైనంత త్వరగా ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసి ప్రకటిస్తాము అని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ కూడా విబేధాలు లేకుండా కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లి కూటమిని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఒక కుటుంబం సరిగా ఉండటం జగన్మోహన్ రెడ్డి చూడలేరు…ఇద్దరు అన్నదమ్ములు సరిగా ఉంటే చూడలేరని మండిపడ్డారు.టిడిపి,జనసేన కూటమి కలయిక ఏర్పాటును జీర్ణించుకోలేక రెండు పార్టీల మధ్య తగాదాలు పెట్టు లాభం పొందుదామని దుర్మార్గమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మూడు అంశాలపై ఉమ్మడి మేనిఫెస్టో

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓట్లను చిలనివ్వకుడదన్న లక్ష్యంతో టిడిపి జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ ను రానున్న రోజుల్లో చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీట్ల విషయంలో ఇరు పార్టీల నాయకులు త్యాగానికి సిద్దంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో బై బై వైసిపిని నినాదం ను ప్రతి పౌరుడు కూడా ముందుకు తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.యువతకు ఉపాధి అవకాశాలు,మహిళలకు భద్రత ,రైతులకి భరోసా అనే అంశాలపై ఉమ్మడి మేనిఫెస్టో ను తయారు చేస్తామని తెలిపారు.

సమన్వయ కమిటీ సమావేశ తీర్మానాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను సమగ్ర అభివృద్ధిని, ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం జనసేన పార్టీల అధ్యక్షులుకు టిడిపి, జనసేన సమన్వయ కమిటీ సమావేశం ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానం చేసింది. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.రైతులను ఆదుకోవడానికి వైసిపి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.ఫలితంగా రైతులు నిరాశ , నిసృహలతో కొట్టుమిట్టాడుతున్నారు.ఇటువంటి క్లిష్ట తరుణంలో రాష్ట్రాన్ని కాపాడుకోవడం భాద్యతగా భావించి తెలుగుదేశం, జనసేన ఒక తాటిపై నిలిచి ఎన్నికలకు ఎన్నికలు సంసిద్ధం అవుతున్నాయి అని కమిటీ తెలిపింది.

మీడియాపై గుందాగిరి ప్రజాస్వామ్యానికి హానికరం..
ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియా రంగంపై ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో దాడులు పెరిగిపోతుండటం దురదృష్టకర పరిణామం. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో మీడియా ప్రతినిధులు ,మీడియా కార్యాలయాలపై ఒక పథకం ప్రకారం వైసిపి నాయకులు కార్యకర్తలకు దాడులు పాల్పడుతున్నారన్నారు ద్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *