fbpx

దగా డీఎస్సీ వేసిన జగన్ ….దగా ముఖ్యమంత్రి కాదా ? వైయస్ షర్మిల

Share the content

రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. మెగా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న 23,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. మరి ఈ ఐదేళ్లలో ఎన్ని పోస్టులను భర్తీ చేసారని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు షర్మిల ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపి యూత్ కాంగ్రెస్ గురువారం ఛలో సెక్రటేరియట్ పిలుపునిచ్చిన నేపథ్యంలో విజయవాడ లోని ఆంద్రరత్న భవన్ వద్ధ ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారంలో దబాయిస్తు ఇప్పటివరకు ఆరు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని నిసిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


తమ సొంత సైన్యాన్ని తయారు చేసుకొనేందుకు సచివాలయ వ్యవస్థ ద్వారా 1,21,000 మందికి రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకొని 51,000 కొత్త ఉద్యోగాలు సృష్టించామని అసత్యాలు చెబుతున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు హామీ ఇచ్చిన వాటిలో ఇవేవీ లేవు అని తెలిపారు. ఈ ఐదేళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా నియమించింది కేవలం 2557 ఉద్యోగాలు మాత్రమేనని వెల్లడించారు.హామీ ఇచ్చిన మేరకు 2,30,000 పోస్టులను ఐదు సంవత్సరాల లో ఎందుకు భర్తీ చేయలేదు? ఐదేళ్లు గుడ్డీ గుర్రాలకు పల్లు తోమారా? అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 52,000 పోస్టులలో మెగా డీఎస్సీ వేశారని గుర్తు చేశారు.

దేవుడి దయ మీ మీద ఉంటే చాలా? మీ దయ నిరుద్యోగుల మీద లేదా?

గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించినప్పుడు 23,000 ఖాళీలు ఉంటే కేవలం 7000 పోస్టులు మాత్రమే భర్తికి నోటిఫికేషన్ వేశారని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ను జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఎద్దేవా చేశారు. మరి నేడు ఏమైంది? చంద్రబాబు ను విమర్శించిన మాటలు మీకు వర్తించవా? అని ప్రశ్నించారు. దేవుని దయతో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఇస్తాము అని అన్నారు. దేవుని దయతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు…మీ దయ నిరుద్యోగుల మీద లేకుండా పోయిందని మండిపడ్డారు. ఆంధ్రరాష్ట్ర లో పుట్టిన పాపానికి మీరు ఒక్క రోజు అయినా స్పెషల్ స్టేటస్ కోసం పోరాడారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మెగా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న 23000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఐదేళ్లలో ఖాళీలు కలిపి 30,000 ఉధ్యోగాలతో మెగా డీఎస్సీ వేసి ఉండచ్చు….మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ వేశారని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *