fbpx

విధ్వంసకారుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : జ్యోతుల నవీన్ కుమార్

Share the content

ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి తనను తాను హీరోగా ప్రోజెక్ట్ చేసుకుంటూ వచ్చారు….ఇతర పక్షాలను విలన్లుగా చూపిస్తూ సినిమాలు తీశాడు. తప్పుడు ప్రచారంతో జగన్ సినిమాలు తీయవచ్చు కానీ….ఐదు కోట్ల అంధ్రులను వంచించిన ప్రభుత్వ దమన కాండపై రాజధాని ఫైల్స్ చిత్రం తీయకూడదా అని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని అమరావతి పై ముఖ్యమంత్రి జగన్ చేసిన విష ప్రచారం,విధ్వంసంపై రాజధాని ఫైల్స్ సినిమాలో దర్శకులు కళ్లకు కట్టినట్లు చూపించారని ఆయన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వం టెర్రిరిజంతో చేసిన విధ్వంసం ఈ సినిమా ద్వారా అందరికీ చేరుతుందని జగన్ భయపడ్డారని ఎద్దేవా చేశారు. వేల కోట్ల ప్రభుత్వ సంపదను ఒక సైకో ఎలా నాశనం చేశాడు..రైతులు, మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించాడు అనే నిజాలు అన్నీ ఈ సినిమా ద్వారా ప్రజల్లోకి వెళతాయి అని ప్రభుత్వం భయపడింది అని అన్నారు. రాజధాని ఫైల్స్ సినిమాపై జగన్ తప్పుడు ఆరోపణలతో సొంత పార్టీ నేతల ద్వారా కేసులు వేశారని మండిపడ్డారు. అడుగడుగునా సినిమాను అడ్డుకునేందుకు అన్ని రకాల కుట్రలు చేశారని ధ్వజమెత్తారు.

ప్రతిపక్షాలపై మీడియా, సోషల్ మీడియా తోపాటు సినిమా లను వాడుకుంటున్న వ్యక్తి జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. రాజధాని ఫైల్స్ ఏమీ కల్పిత కథ కాదు…..మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలసిన జగన్ విధ్వంస కధే. జగన్ తన అంగబలంతో, అర్థబలంతో సినిమాను అడ్డుకోవాలని చూసి విఫలం అయ్యారని తెలిపారు. జగన్ తీరు మొదటి నుంచి అంతే….తనకున్న అధికారం ద్వారా సామాన్యులపై యుద్దం చేస్తాడు.
వందల కోట్లు ప్రజా ధనాన్ని వెచ్చించి కేసులు వేసి తన పంతం నెగ్గించుకోవాలని ప్రతి సారీ ప్రయత్నం చేస్తాడు. గతంలో మూడు రాజధానుల విషయంలో ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు రాజధాని సినిమా విషయంలోను అదే చేస్తున్నాడు.

ఒక ముఖ్యమంత్రి వందల వేల కోట్లు పెట్టి ప్రజలకు వ్యతిరేకంగా యుద్దం చేయడం అనేది మనం అమరావతి విషయంలోనే చూశాం.మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకించారని శాసన మండలినే రద్దు చేశారని గుర్తు చేశారు. అమరావతి విధ్వంసం వల్ల రాష్ట్రం లక్షల కోట్ల సంపద నష్టపోయింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అంటున్నాడు…జగన్ ఒక నిజమైన విధ్వంసకారుడుగా చరిత్రలో నిలిచిపోతారని జోస్యం చెప్పారు.జగన్ రాష్ట్రాన్ని ఎంత విధ్వంస చేశాడో అంటూ…అతని విధ్వంసంపై ఏకంగా పుస్తకాలే ప్రచురిస్తున్నారు.రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలు భవిష్యత్ ను విధ్యంసం చేసిన జగన్….కథ ముగియనుంది అని పేర్కొన్నారు.జగన్ సినిమా అయిపోయింది… కోర్టు తీర్పుతో సైకో విధ్వంసాన్ని ప్రజలకు చూపే రాజధాని ఫైల్స్ సినిమా మళ్లీ మొదలు అయ్యింది అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *