fbpx

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్ గాంధీ

Share the content

పశ్చిమగోదావరి జిల్లా కొత్త కలెక్టర్ గా సుమిత్ కుమార్ గాంధీ నియమితులయ్యారు.. 2014లో నరసాపురం కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించి పనిచేసారు. సబ్ కలెక్టర్ పనిచేసిన సుమిత్ కుమార్ గాంధీకి రెవిన్యూ డివిజన్లోని నరసాపురం, పాలకొల్లు, ఆచంట ,భీమవరం ,ఉండి శాసనసభ నియోజకవర్గాలు ఆయనకు సుపరిచితమే. ఇక కొత్తగా ఏలూరు రెవెన్యూ డివిజన్ లోని తాడేపల్లిగూడెం కొవ్వూరు రెవిన్యూ డివిజన్ లోని తణుకు నియోజకవర్గం లు కొత్తగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లాలో చేరాయి . సమిత్ కుమార్ గాంధీ అదే నరసాపురం రెవిన్యూ డివిజన్( ఎక్కువ భాగం)పశ్చిమగోదావరి జిల్లా జిల్లాగా ఏర్పడడంతో మళ్లీ అదే ప్రాంతానికి ఆయన కలెక్టర్ గా రావడం పని చేయనుండడం విశేషం .ఆనాడు సబ్ కలెక్టర్ అయితే నేడు కలెక్టర్ అయ్యారు. హర్యానా రాష్ట్రం లోని మారుమూల ప్రాంతం రోహతక్ జిల్లా కోనూర్ గ్రామం లోని మధ్యతరగతి కుటుంబం లో జన్మించిన ఆయన కష్టపడి చదువుకుని పైకి వచ్చారు. చిన్నప్పుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే ఆయన విద్యాభ్యాసం చేశారు. తర్వాత కాలంలో ఇంజనీరింగ్ చేసి ఐటి ప్రొఫెషనల్ గా గురుగావ్ లో నాలుగు సంవత్సరాలు పాటు పని చేశారు . తర్వాత సివిల్స్ రాసి 2014 లో ఐఏఎస్ కు ఎంపికయ్యారు. జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు తెలుసుకోవడానికి స్కిల్స్ ను డెవలప్మెంట్స్ ను పెంచుకోవడానికి ఇంటర్నెట్ తో పాటు పత్రికలను కూడా ఆయన అధ్యయనం చేసేవారు. యువత కష్టపడి చదువుకోవాలని సామాజిక స్పృహ కలిగి ఉండాలని ప్రశ్నించే తత్వం ఉండాలని ఆయన భావించేవారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం లో ట్రైనీ కలెక్టర్ గా పనిచేసిన సుమీత్ కుమార్ గాంధీ తర్వాత నర్సాపురం సబ్ కలెక్టర్ గా శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్ గా , అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా పనిచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *