fbpx

డబ్బులు పంచితే… ఓట్లు వేస్తారనే భ్రమలో వైసిపి : నాగబాబు

Share the content

అధికార వైసిపి నాయకులకు అహంకారం తలకెక్కింది.ఎన్నికలకు ముందు డబ్బులు ఇస్తే.. ప్రజలే ఓట్లు వేస్తారని బ్రమలో ఉన్నారు. వైసిపికి తలకెక్కిన అహంకారాన్ని దింపాలంటే యుద్ధాలు ,ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు.జనసేన టిడిపి కూటమి నీ గెలిపిస్తే చాలు, ప్రజల జీవితాల్లో తప్పక మార్పు వస్తుంది అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు తెలిపారు. శుక్రవారం మాడుగుల నియోజకవర్గంలో ఆ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ …. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్ వైపే చూపిస్తున్నాయి. వైసిపి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటుంది.. కానీ …ఇది మత్తు పదార్థాలకు సహకరిస్తూ ఒక మాఫియా ప్రభుత్వంగా తయారు అయ్యింది అని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అయిన బూడి ముత్యాల నాయుడు గత ఎన్నికల కు ముందు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను బాగు చేస్తామని చెప్పారు…నేడు ఆయన ఉప ముఖ్యమంత్రి..పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గా కూడా ఉన్నారు.హామీ ఇచ్చి ఐదేళ్లు అవుతున్నా ఆ హామీ ఏమైంది అని ప్రశ్నించారు.రేపు ఆయన ఓట్లు అడగటానికి మీ ఇంటికి వస్తారు.వేస్తే ఎం చేశారని మీకు ఓట్లు వేయాలని అడగండి.

పోలీసులను రోబోల్లా మార్చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు విషయంలో పోలీసుల చేతులు కట్టేశారు.నాయకులు చెప్పింది పోలీసులు చేయడం తప్ప పోలీసులు ఎం చేయలేకపోతున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. వైసిపి పాలనలో 35 వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు అని..అందులో 25 వేల మంది ఆచూకీ ఇప్పటకీ తెలియడం లేదని వాపోయారు.రాబోయే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక భూమిక పోషిస్తారు. ఏ స్థాయి వ్యక్తి తప్పు చేసినా తాట తీసి జైల్లో కుర్చిపేడతారు అని తెలిపారు.నిజాయతీ గల పోలీస్ అధికారులను ముందుకు తీసుకువచ్చి గాడి తప్పిన లా అండ్ ఆర్డర్ ను సరి చేస్తారు అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్త్రరాంధ్ర రాజకీయ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి సుంద రపు వెంకట సతీష్, విశాఖపట్నం రూ రల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ ,పార్టీ అధికార ప్రతినిధి ఎస్. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *